BigTV English

Ntr : ఎన్టీఆర్ ముందు రెండు సవాళ్లు.. బాలీవుడ్ లో టార్గెట్ చేశారా..?

Ntr : ఎన్టీఆర్ ముందు రెండు సవాళ్లు.. బాలీవుడ్ లో టార్గెట్ చేశారా..?

Ntr : ఇండస్ట్రీలో హీరోలు బాగానే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే కచ్చితంగా మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతుంటారు.. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ మధ్య వారు ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అయితే అలాంటి ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన అగ్ర హీరోలిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేయడంతో ఇకపై ఎలాంటి ఫ్యాన్ వార్స్ ఉండవనుకున్నారంతా.. ఈ సినిమా విడుదల టైంలో కూడా ఫాన్స్ వార్ గట్టిగానే జరిగింది. వచ్చి ఇంత కాలమవుతున్నా ఇప్పటికీ ఆ గొడవలు సమసిపోలేదు. ఇప్పటికీ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూనే ఉన్నారు.. ఇది సరిపోతున్నట్టు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ రచ్చ మొదలైంది..


ఎన్టీఆర్ పై బాలీవుడ్ పీఆర్ టీమ్ వార్..

ఎన్టీఆర్ పరిస్థితి దారుణంగా మారింది. తెలుగు మెగా ఫ్యాన్స్, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తయారైయ్యారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన వార్2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.. ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కాబోతుంది. వార్2 రిలీజ్ టైమ్ నాటికి ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా రెండు స్ట్రాంగ్ గ్రూపులు అతన్ని టార్గెట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. తెలుగు ట్విట్టర్ యూత్, అలాగే బాలీవుడ్ లో హృతిక్ ఫ్యాన్స్ ట్విట్టర్ యూత్ కూడా ఉన్నారు. ఈ రెండు గ్రూపులు ఇప్పుడు ఎన్టీఆర్ ను టార్గెట్ ను చేయడంతో ఎన్టీఆర్ తో పాటూ అతని ఫ్యాన్స్ కూడా వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది…


Also Read : ఓజీలో పవన్ వారసుడు… ఎంట్రీతోనే హిట్ కొట్టేశాడా..?

బాలీవుడ్ కు ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయా..? 

వార్ 2 మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. వార్2లో హృతిక్ రోషన్ నటించడం వల్ల కొన్ని పీఆర్ ఏజెన్సీలు బాలీవుడ్ హీరోకు సరిపోయేంత కవరేజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఇది కూడా ఎన్టీఆర్ కు ఛాలెంజ్ గా మారే అవకాశముంది. అసలే ఇది ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మొదటి సినిమా.. అందుకే తక్కువ ప్రమోషన్స్ తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తనను తాను ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం తారక్ కు ఉంది. మరి ఈ విషయాన్ని ఎన్టీఆర్, అతని ఫ్యాన్స్ ఎలా హ్యాండిల్ చేసి ముందుకెళ్తారో చూడాలి. ఏదేమైనా వార్2 ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ గతంలో తన నటించిన సినిమాలు కన్నా ఎక్కువగా ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ గనక హిట్ అయితే అక్కడ కూడా మన హీరో లెవెల్ మారిపోతుంది. ఏం జరుగుతుందో మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×