E-Paper
Advertisement

CM KCR: ఉందిలే మంచి కాలం.. కలల లోకంలో కేసీఆర్!

CM KCR: ఉందిలే మంచి కాలం.. కలల లోకంలో కేసీఆర్!
Advertisement

CM KCR: మళ్లీ నేనే సీఎం.. రాస్కో సాంబా.. అంటూ గబ్బర్‌సింగ్ రేంజ్‌లో డైలాగులు కొడుతున్నారు కేసీఆర్. ఫాంహౌజ్‌లో తనను కలిసిన బీఆర్ఎస్ నాయకుల ముందు మాటల గారడీ చేస్తున్నారా? కేడర్‌ను కాపాడుకునేందుకు తనదైన స్టైల్‌లో కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మాయల మరాఠీ, టక్కుటమారం విద్యలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ చెప్పే ముచ్చట్లు.. ఆయన ముచ్చట తీర్చేనా?

కేసీఆర్ లేటెస్ట్ కామెంట్స్ పొలిటికల్‌గా కాక రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్‌దే అన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని.. తాము మాత్రం సింగిల్‌గా పవర్‌లోకి వస్తామని చెప్పారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా.. తెలంగాణ కోసం తాను ఎక్కడా వెనకడుగు వేయలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆరోపించారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని.. ఇప్పుడు తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

Advertisement

కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కస్సున లేచారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఊహాలోకంలో ఉంచండి.. మీరేమో ఫాంహౌజ్‌లోనే ఉండండి అంటూ సెటైర్లు వేశారు. మీరు ఎన్ని కలలు కన్నా.. అధికారంలోకి రావడం అసంభవం అని తేల్చి చెప్పారు సీతక్క.

బీజేపీతో కలిసినా కేసీఆర్ గెలవలేరా?

Advertisement

అటు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం గులాబీ బాస్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని.. కేసీఆర్ పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు. సింగిల్‌గానే కాదు.. కేసీఆర్ బీజేపీతో జతకట్టినా గెలవలేరని.. మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీదేనని తేల్చి చెప్పారు. ఫాంహౌజ్‌లో ఉండి కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సృష్టించిన ఆర్ధిక విధ్వంస పునాధుల మీద.. రైజింగ్ తెలంగాణను పునర్ నిర్మిస్తున్నామని కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూసి బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. కుటుంబం కోసం తెలంగాణ ప్రయోజనాలను పదేళ్ల పాటు ప్రధాని మోదీ ముందు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్.

Also Read : కేసీఆర్ దెబ్బకు 47మంది ఆఫీసర్లు ఫసక్

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. కేసీఆర్ వైఖరి మాత్రం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీకి రాకున్నా, ప్రజల్లోకి వెళ్లకున్నా.. ఫాంహౌజ్‌లో మకాం వేసి రాజకీయ మంటలు రాజేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ గెలుస్తామని.. తాను మరోసారి ముఖ్యమంత్రి అవుతానంటూ.. కేసీఆర్ మైండ్ గేమ్ అడుతున్నారని అంటున్నారు. అమావాస్యకో, పున్నమికో.. ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పార్టీ నేతలను రప్పించుకోవడం.. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ వారికి భరోసా ఇవ్వడం కేసీఆర్‌కు రొటీన్ ప్రోగ్రామ్‌గా మారింది.

కాంగ్రెస్‌లో ఏదో అయిపోతోంది.. అన్నివర్గాల్లో వ్యతిరేకత వస్తోంది.. అంటూ ఫేక్ ప్రచారాన్ని ప్రజలపై బలంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. ఈ కుట్రను గుర్తించే.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఫైర్ అవుతున్నారు. దోచుకుని దాచుకున్న బ్లాక్ మనీతో కేటీఆరే ఇదంతా చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాలో.. కేసీఆర్ ఫాంహౌజ్‌లో.. ఇద్దరూ కలిసి రేవంత్ సర్కార్‌ను బద్నామ్ చేసే కుతంత్రం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు కాక మీదున్నాయి. మళ్లీ తానే సీఎం అవుతానంటూ కేసీఆర్ చేస్తున్న ఈ కామెంట్స్ మైండ్ గేమ్ మినహా మరోటి కాదని.. బీఆర్ఎస్‌కు అంత సీన్ లేదని.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెబుతున్నారు హస్తం నేతలు.

Related News

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

Big Stories

Advertisement
×