Adventure Movie OTT : తమిళ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. సినిమాల్లో నటించడం మాత్రమే కాదు. సినిమాలకు దర్శకత్వం వహిస్తూన్నాడు. అలాగే ప్రొడ్యూసర్ గా కూడా నటిస్తున్నాడు. ఈ మధ్య ఏ సినిమాలైన రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి వస్తుంది. అయితే హీరో ధనుష్ నటించిన ఓ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..
Also Read : చిన్నప్పుడే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను.. లైవ్ లోనే ఏడ్చేసిన హీరోయిన్..
మూవీ & ఓటీటీ..
ఆరేళ్లుగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాని ధనుష్ నటించిన అడ్వెంచర్ కామెడీ ఇంగ్లిష్ కామెడీ మూవీ ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ఎ ఫకీర్. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమా ఇన్నాళ్ళ తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.. థియేటర్లలో ఈ మూవీ బోల్తా కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది. జూన్ 21, 2019 లో భారత్ లో రిలీజైంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సుమారు ఆరేళ్ల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.. ఈ నెల రాబోతుందని ముందుగా ప్రకటించిన ఓటీటీ సంస్థ ఆహా మొత్తానికి ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
హీరో ధనుష్ సినిమాలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి. అయితే ఆయన నటించిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేదు. ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్. కెన్ స్కాట్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. 2 కోట్ల డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర కేవలం 32 లక్షల డాలర్లే వసూలు చేసింది. ఇందులో అజాత శత్రు లవష్ పటేల్ అనే ఓ మెజీషియన్ పాత్రలో ధనుష్ కనిపించాడు. తనకు అతీత శక్తులు ఉన్నాయని జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు ధనుష్. ముంబైలోని ఓ స్లమ్ లాంటి ఏరియాలో జీవిస్తుంటాడు. పోలీసులకు చిక్కిన ముగ్గురు చిన్నారులకు అతడు తన కథను చెబుతాడు. తన తల్లి అకాల మరణం తర్వాత పారిస్ లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే ధనుష్ కి ఒక పరిస్థితి ఎదురవుతుంది. ఐకియా లోని ఒక రోబోలో అతను చిక్కుకుంటాడు.. అందులోనే ప్రపంచమంతా తిరుగుతాడు. అయితే చివరికి తన తండ్రిని కలుసుకుంటాడా లేదా అన్నది సినిమా స్టోరీ లో చూడాలి.. ప్రస్తుతం ధనుష్ కుబేర సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టుల లో ఆయన నటించబోతున్నాడు.. ఈ ఏడాది ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు..