BigTV English

Clothing Culture: అక్కడి ప్రజలకు దుస్తులు అంటే అలర్జీ.. విప్పుకుని తిరిగితేనే ఎనర్జీ అట!

Clothing Culture: అక్కడి ప్రజలకు దుస్తులు అంటే అలర్జీ.. విప్పుకుని తిరిగితేనే ఎనర్జీ అట!

Big Tv Live Originals: సంస్కృతులు, సంప్రదాయాలు అనేవి ఆయా ప్రాంతాల్లోని వాతావరణం, సామాజిక నిబంధనలు, మత విశ్వాసాల ఆధారంగా రూపొందుతాయి. అలాగే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంప్రదాయం కూడా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు ఆధారంగానే ఏర్పడింది. ప్రజలు ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దుస్తులు ధరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దుస్తులు లేకుండా, ఉంటే.. ఉండి లేనట్లు ధరించే వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడి ప్రజలు దుస్తులు లేకుండా జీవించేందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఈ ఆచారం సంప్రదాయంలో భాగం కావచ్చు. అక్కడి వాతావరణంత ప్రభావితమై ఉండవచ్చు. అదీ కాదంటే ఆధునిక నగ్నవాద తత్వాల కారణంగా స్వీకరించి ఉండవచ్చు. ఇంతకీ, ఉండీ లేనట్లు దుస్తులు ధరించే తెగలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


1.కనీస దుస్తులు తెగలు

ప్రపంచంలోని పలు ప్రాంతాలలో చాలా మంది ప్రకృతితో మమేకమై జీవించే తెగలు ఉన్నాయి. వీళ్లంతా పురాతన ఆచారాల ప్రకారం జీవిస్తున్నారు. ఈ తెగల ప్రజలు నివసించే వేడి వాతావరణం కారణంగా ఉండీ లేనట్లు దుస్తులు ధరిస్తారు. పెయింట్, గవ్వల నగలు, ఈకలు వంటి శరీర అలంకరణలపై ఎక్కువ దృష్టి పెడతారు.


⦿ ఆఫ్రికా

❂ హింబా తెగ (నమీబియా): హింబా ప్రజలు ఉత్తర నమీబియాలోని ఎడారులలో నివసిస్తారు. సంచార పశువుల కాపరులుగా జీవిస్తారు. తీవ్రమైన వేడి కారణంగా వాళ్లు చిన్నచిన్న దుస్తులు ధరిస్తారు. మేక చర్మాలతో తయారు చేసిన వస్త్రాన్ని చుట్టుకుంటారు. సూర్యుడి భగభగల నుంచి తట్టుకునేందుకు ఒంటి మీద ఎరుపు ఓచర్, వెన్నతో అలంకరించుకుంటారు.

❂ ముర్సి, కారో తెగలు (ఇథియోపియా): వీళ్లు కూడా ఒంటి మీద దుస్తులకు బదులుగా రకరకాల రంగులను పూసుకుంటారు. చాలా తక్కువ దుస్తులు ధరిస్తారు. వీళ్లు దుస్తుల కంటే సాంస్కృతి ముఖ్యమైనదిగా భావిస్తారు.

⦿ దక్షిణ అమెరికా

❂ అమెజోనియన్ తెగలు (బ్రెజిల్, పెరూ, వెనిజులా): యానోమామి లాంటి అమెజాన్ రెయిన్‌ ఫారెస్ట్‌ లో ఈ తెగలు నివసిస్తున్నాయి. ఆధునిక ప్రపంచానికి దూరంగా ఒంటరిగా ఒంటరిగా నివసిస్తున్నాయి.  ఈ తెగలు తక్కువ దుస్తులను ధరిస్తారు. కేవలం నడుము చుట్టూ చిన్న వస్త్రాలను ధరిస్తారు. సామాజిక స్థితిని వ్యక్తీకరించడానికి ఒంటికి పెయింటింగ్, ఈకలు కలిగిన కిరీటాలను ధరిస్తారు. పూసలతో తయారు చేసిన దండలను ధరిస్తారు.

⦿ ఓషియానియా

❂ కొరోవై తెగ (పుపువా న్యూ గినియా): ఈ తెగల ప్రజలు చెట్ల మీద ఏర్పాటు చేసిన ఇళ్లలో నివసిస్తారు. వీళ్లలో కొంత మంది తక్కువ దుస్తులు ధరిస్తారు. మరికొంత మంది ఎలాంటి దుస్తులు వేసుకోరు. పురుషులు పురుషాంగ తొడుగులు ధరిస్తారు. మహిళలు గడ్డితో తయారు చేసిన స్కర్టులు ధరిస్తారు. టాప్‌ లెస్‌ గా ఉంటారు.

⦿ భారత్

❂ సెంటినెలీస్ తెగ (అండమాన్ దీవులు): ఈ తెగ కూడా ప్రపంచానికి దూరంగా నివసిస్తుంది. వారు దాదాపు దుస్తులు ధరించరు. ఆకులు, దండలను సాధారణ అలంకరణలను ఉపయోగిస్తారు. శతాబ్దాలుగా వాళ్లు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

2.ఆధునిక న్యూడిస్ట్ కమ్యూనిటీలు

స్థానిక సంస్కృతులకు అతీతంగా, నగ్నత్వాన్ని కోరుకునే సమాజాలు ఉన్నాయి. దీనిని నేచురిజం అని కూడా పిలుస్తారు.

⦿ జర్మనీ

జర్మనీలో ఫ్రీ బాడీ కల్చర్ అనేది బలమైన సంప్రదాయం ఉంది. ఇక్కడ సౌనాస్, పార్కులు,  బీచ్‌లు సహా పలు ప్రాంతాల్లో  నగ్నంగా ఉండేందుకు ఇష్టపడుతారు. స్వేచ్ఛ, సమానత్వానికి ఓ మార్గంగా నగ్నత్వాన్ని చూస్తారు.

⦿ ఫ్రాన్స్

ఫ్రాన్స్ లోని  బోలెడె న్యూడిస్ట్ బీచ్‌లు ఉన్నాయి.  న్యూడిస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలువబడే కాప్ డి’అగ్డే  లాంటి  నేచురిస్ట్ రిసార్ట్‌ లకు నిలయంగా జర్మనీ కొనసాగుతోంది.

⦿ అమెరికా, ఆస్ట్రేలియా

ఈ దేశాల్లో చాలా మంది బీచ్ లలో నగ్నంగా కనిపిస్తారు. మరికొంత మంది తక్కువ దుస్తులతో కనిపిస్తారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరు. వ్యక్తిగత స్వేచ్ఛకు గుర్తుగా నగ్నంగా ఉంటారు.

దుస్తులు సామాజిక స్థితి, వినయం, సాంస్కృతిక గుర్తింపును సూచించే ప్రపంచంలో, నగ్నత్వం అనేది  చరిత్ర, ప్రకృతితో లోతుగా ముడిపడి ఉంది. అమెజాన్‌ లోని మారుమూల అడవుల్లో అయినా, యూరప్‌ లోని బీచ్‌ లలో అయినా, దుస్తులు లేకపోవడం అనేది జీవన శైలికి ఉదాహరణగా కొనసాగుతోంది.

Read Also: గర్భిణీలకు ఏడో నెలలోనే ఎందుకు సీమంతం చేస్తారంటే.. ఇదీ అసలు విషయం!

Tags

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×