Big Stories

kcr: అలా చేస్తే మహారాష్ట్రకు రాను.. దేశంలో రైతు తుపాన్ రాబోతోంది: కేసీఆర్

kcr: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడ్ పెంచారు. మహారాష్ట్రలో మరోసారి బహిరంగ సభ నిర్వహించారు. అక్కడి ప్రభుత్వంపై భగ్గుమన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి చేస్తే తాను మహారాష్ట్రకు రాను అని అన్నారు. త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని.. దానిని ఆపే శక్తి ఎవరికీ లేదని వెల్లడించారు కేసీఆర్.

- Advertisement -

అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహలో భారీబహిరంగ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు బీమా ఇస్తూ.. పూర్తిగా పంటను కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. దళితల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథాకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.

- Advertisement -

మహారాష్ట్రలో దళితుల పరిస్థితి దయనీయంగా ఉందని.. ఇక్కడ కూడా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో అభివృద్ధి చేస్తే.. మళ్లీ తాను అక్కడ అడుగు పెట్టనని ప్రకటించారు. పథకాలు అమలు చేసే వరకు వస్తూనే ఉంటానని చెప్పారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినప్పటికీ పేదల బతుకులు మారలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ హయాంలో పేదలు మరింత పేదరికంలోకి దిగజారారని చెప్పారు. గోదావరి, కృష్ణా వంటి నదులు మహారాష్ట్రలోనే పుట్టినప్పటికీ రైతులకు ఎందుకు మేలు జరగడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తలుచుకుంటే దేశంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చని వెల్లడించారు. అలాగే దేశంలో నిల్వ ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్‌ను అందించొచ్చు అని తెలిపారు.

అలాగే మహారాష్ట్రలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్ చేయించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనీ గెలిపిస్తే.. ప్రజల సమస్యలను వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ తరహాలో మహారాష్ట్రను అభివృద్ధిచేస్తామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News