MLC Kavitha: బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవితపై వేటు అంతా వత్తిదేనా? కూతురుపై వేటు పార్టీ నేతలకు కేసీఆర్ పంపించిన సందేశమా? ఇంతకీ కవిత ఇంటికి ఆమె తల్లి సడన్‌గా రావడం వెనుక ఏం జరుగుతోంది? రాయబారం ఎంతవరకు వచ్చింది? దీనిపై కూతురు కవిత ఏమన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఎమ్మెల్సీ కవిత మళ్లీ బీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఆమె రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ ఎందుకు పెండింగ్‌లో పెట్టారు. ఇదంతా బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా వర్ణిస్తున్నాయి అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. అన్నట్లు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సతీమణి శోభ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లారు. బుధవారం రాత్రి అల్లుడు అనిల్ పుట్టిన రోజు కార్యక్రమానికి హాజరయ్యారు.
తల్లిని చూడగానే కవిత ఒక్కసారిగా కంటతడి పెట్టారట. తల్లిని కూర్చొబెట్టి అందరి గురించి కవిత అడిగి తెలుసుకున్నారట. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది, కోపం తగ్గిందా? అంటూ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తల్లిగా కూతురికి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పారట. రోజులు ఎప్పుడూ ఎలాగే ఉండవని, త్వరలో అన్ని సర్దుకుంటాయని కవితకు తల్లి చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల మాట.
ఆ తర్వాత భోజనం చేసి మళ్లీ తల్లి ఇంటికి వెళ్లిపోయారని సమాచారం. ఉన్నట్లుండి సడన్ కవిత ఇంటికి తల్లి రావడం ఈ మధ్యకాలంలో జరగలేదని అంటున్నారు. మొన్నటికి మొన్న కేసీఆర్ ఇంటికి వెళ్లినా ఏ ఒక్కరూ కవితను పలకరించలేదని అంటున్నారు.
ALSO READ: మళ్లీ ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు, రెండ్రోజులు జాగ్రత్త
సెప్టెంబర్ ఐదున కవిత కొడుకు బర్త్ డే కార్యక్రమం జరిగింది. దానికి తల్లిదండ్రులు హాజరుకాలేదు. కుమారుడి బర్త్‌డే సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారట కవిత. కుటుంబసభ్యులు హాజరవుతాయని కవిత బంధువులు భావించారు. ఏ ఒక్కరూ హాజరుకాలేదట. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు 2న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అధినేత కేసీఆర్.
అది జరిగి మూడురోజుల తర్వాత తన కొడుకు బర్త్‌డే కార్యక్రమానికి రావాలని కవిత ఆహ్వానించినా కనీసం తల్లి కూడా వెళ్లలేదు. మనవడికి బట్టలు, పూజా సామగ్రి మాత్రమే పంపినట్టు పార్టీ వర్గాల మాట. మనవడి పుట్టిన రోజుకి వెళ్లకపోయినా పర్వాలేదని కానీ, ఇంటి అల్లుడి విషయంలో అలా చేయకూడదని భావించి, తల్లి వచ్చినట్టు చెబుతున్నారు.
పార్టీలో పరిస్థితులు ఇప్పుడు కాకపోయినా మెల్లగా సర్దుకోవడం ఖాయమని అంటున్నారు పార్టీ నేతలు. అందుకే కవిత విషయంలో ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదని అంటున్నారు. కవితపై వేటు తర్వాత తొలిసారి కూతురు ఇంటికి తల్లి రావడాన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.