Illu Illalu Pillalu Today Episode September 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. మంచి టైం లో వచ్చి డిస్టర్బ్ చేసింది అని శ్రీవల్లిని తిట్టుకుంటారు. అయితే ఏంటి వదిన ఇలా వచ్చావు ఏం కావాలి అని సాగర్ అడుగుతాడు. నేను కొంచెం నర్మదతో అర్జెంటుగా మాట్లాడాలి అని శ్రీవల్లి అంటుంది. అయితే శ్రీవల్లి నర్మద దగ్గరకు వచ్చి నేను ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అది గురించి నాకు క్లారిటీ ఇస్తే ఆ తర్వాత మామయ్య గారి దగ్గర మీరు సేఫ్ గా ఉంటారు అని అడుగుతుంది. విషయం గురించి నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అని శ్రీవల్లిని అడుగుతుంది నర్మదా.. ఇంతకీ దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావ్ అక్క అని అడుగుతుంది నర్మదా. నువ్వు సాగరు నిన్న ఎగ్జామ్స్ సెంటర్ దగ్గర కనిపించారట మా ఫ్రెండు ఫోన్ చేసి చెప్పింది ఎగ్జామ్ ఎందుకు రాశారు అని అడుగుతుంది. ఆ మాట వినగానే నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రేమను అడిగితే సమాధానం చెప్పదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి చేతిలో ఒక పేపర్ పడుతుంది. అప్పుడే తన చేతిలోకి ఒక పేపర్ వచ్చి పడుతుంది అది చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. ప్రేమ ఒక అబ్బాయిని పరిగెత్తించినట్లు ఆ ఫోటో కనిపించడంతో ఒక్కసారిగా సంతోషంతో బయటికి వచ్చి గంతులు వేస్తుంది.. దేవుడు నా వైపే ఉన్నాడు. నాకు ఇంత మంచి చేస్తున్నాడని అస్సలు ఊహించలేదు అని డాన్సులు వేస్తుంది. శ్రీవల్లి లోపలికి వెళ్లి రామరాజుకు పేపర్ చూపించి అందులో మన ప్రేమ లాగే ఉంది కదా అని అడుగుతుంది.. వేదవతిని రామరాజు అడుగుతాడు. మన ప్రేమ ఎవర్నో తరుముతో వెళ్తుంది ఏంటి ఎవరు వాడు అని రామరాజు అడుగుతాడు.
ప్రేమ మౌనంగా ఉండడంతో శ్రీవల్లి ఏంటి ప్రేమ మౌనంగా ఉన్నావు మావయ్య గారు అంటే భయం లేదా మర్యాద లేదా ఆయనకి ఇలాంటి విషయం చెప్పాల్సిన అవసరం మీకు లేదా అని కావాలని ఇరికించేలా మాట్లాడుతుంది. నర్మదా ప్రేమ చెప్పేంతవరకు కూడా ఆగవా అక్క నీకెందుకు అంత కడుపుబ్బం అని శ్రీవల్లిని అంటుంది.. ఆ మాట విన్న రామరాజు మళ్లీ నీకన్నా పెద్దది కదా అలా మాట్లాడకూడదు అని సమాధానం చెబుతుంది. ఇక ప్రేమ అతను ఒక దొంగ అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది.
నా బ్యాగ్ ని కొట్టేసి పారిపోతుంటే వాన్ని పరిగెత్తించి కొట్టి మరీ నా బ్యాగు నేను తెచ్చుకున్నాను అని అంటుంది. ఇక శ్రీవల్లి మాత్రం నేను మొదటి అడిగితే ఎవరిని తరిమి లేదు అని అన్నది ప్రేమ.. ఇప్పుడేమో దొంగ అంటుంది ఏదో ఉంది అని శ్రీవల్లి అనుకుంటుంది. కచ్చితంగా ఈ బండారిమెంటో బయట పెడతాను అని శ్రీవల్లి బొకేలు తీసుకెళ్లి ధీరజ్ కు ఇస్తుంది. ప్రేమకు అడ్రస్ లేకుండా ఈ బొకే వచ్చింది. కుళ్ళిపోతుంది కదా పడేయమంటే పడేస్తాను అని కావాలనే హింట్ ఇస్తుంది.. ఆ బొకే ను చూసినా ధీరజ్ ప్రేమ ఆరోజు వచ్చినా పోస్టు ద్వారా తను భయపడిపోతుంది..
ఇప్పుడు ఈ బొకే ఏంటో తెలుసుకోవాలి.. ప్రేమ టెన్షన్ పడుతున్న దానికి ఏదో కారణం ఉంది ఎవరో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని తన రూమంతా వెతుకుతాడు.. మొన్న వచ్చిన కవర్లో ఒక లెటర్ ని చూసి షాక్ అవుతాడు. వెనకాల వచ్చిన ప్రేమ అది చూసి ఎందుకు నువ్వు నా వస్తువులను వెతుకుతున్నావు అని అడుగుతుంది. కానీ ప్రేమ ఏదో దాస్తుందని ధీరజ్ కు అనుమానం వస్తుంది. అయితే ప్రేమ దాచిపెట్టిన ఫోటోలను ఎలాగైనా సమాధి చేయాలని అనుకుంటుంది.
Also Read : ‘మిరాయ్’ ట్విట్టర్ రివ్యూ.. తేజా అకౌంట్ లో మరో బ్లాక్ బాస్టర్..?
అటు కళ్యాణ్ ప్రేమ నన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టింది కుందేలు పిల్లలు అనుకున్నాను కానీ ఇలా రెచ్చిపోతుందని అస్సలు అనుకోలేదు ఈసారి మాత్రం గట్టిగానే సమాధానం చెప్పాలి అని అనుకుంటాడు.. ఇక చందు రెడీ అయ్యి వెళ్తుంటే శ్రీవల్లి అక్కడికి వెళుతుంది. ఇష్టం లేనట్టు చందు మాట్లాడతాడు. మావాళ్లు చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తున్నావా బావ అని అడుగుతుంది.. నువ్వు నన్ను దూరం పెడితే తిరిగి ఆ డబ్బులు మళ్లీ వస్తాయా? నన్ను దూరం పెట్టొద్దు బావ నా ప్రాణం గుంజేస్తుంది అని ఎంతగా బ్రతిమిలాడినా చెందు మాత్రం నీ విషయం నువ్వు చూసుకో నా విషయాలు నేను చూసుకుంటాను అని మొహం మీద తేల్చి చెప్పేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…