E-Paper
Advertisement

Congress : ఢిల్లీకి తెలంగాణ నేతల క్యూ.. కాంగ్రెస్ లో చేరికలు..

Congress : ఢిల్లీకి తెలంగాణ నేతల క్యూ.. కాంగ్రెస్ లో చేరికలు..
Advertisement

Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు. ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మరికొందరు సీనియర్‌ నేతలు హస్తం గూటికి చేరారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్‌, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్‌ కుమార్‌తో పాటు పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్‌ లో చేరారు. ఈ నేతలకు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.

Advertisement

గురువారం రాత్రి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ .. మాణిక్‌ రావ్‌ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల చేరికలు కాంగ్రెస్ కు మరింత బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×