Karthika Deepam 2 serial today Episode: గుడి దగ్గర కళ్లు తిరుగుతున్నాయని ముఖం కడుక్కోవడానికి వెళ్లిన జ్యోత్స్నకు ఎదురుగా సూరజ్ కనిపిస్తాడు. సూరజ్‌ను చూడగానే.. జ్యోత్స్న కోపంగా తిడుతుంది. సూరజ్ మాత్రం మౌనంగా నిలబడి చూస్తుంటాడు. సూరజ్ తన కారులో జ్యోత్స్న మర్చిపోయిన ఫోన్ ఇవ్వడానికి వెళ్తాడు.
జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను కొట్టి చూడరా మా కష్టాలు చూసి నవ్వుకుందామని వచ్చావా..? చూడు అయితే ఏడ్చి ఏడ్చి నా కళ్లు ఎలా ఎరుపెక్కాయో.. చూడు.. రాత్రంతా నిద్ర లేక నా కళ్లల్లో వచ్చిన రక్తపు చారలు చూడు.. మూడు రోజుల నుంచి సరైన తిండి లేక నా చేతులు చూడు ఎలా వణుకుతున్నాయో.. ఇప్పుడే తల తిరుగుతుందని ఇలా ముఖం కడుకుందామని వచ్చాను.. అది కూడా లేకుండా నువ్వు అడ్డుగా నిలబడ్డావు.. ఇక నీ ఇగో శాటిఫై అయిందా..? చెప్పు లేదంటే మేము ఇంకా బాధపడటం చూడాలా..? గుడుల్లో అన్నదానం చేసే మా ఫ్యామిలీ ఇవాళ గుడిలో పెట్టిన ప్రసాదం కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. ఇదంతా నా కారణంగానే జరిగింది. కానీ నువ్వు ఇంకా మమ్మల్ని వదిలిపెట్టవా..? అంటూ తిడుతుంది. సూరజ్ మాత్రం సరే ఇది తీసుకో ఇది నీకు ఈ టైంలో చాలా అవసరం అంటూ ఫోన్ తీసి జ్యోత్న్స చేతిలో పెట్టి వెళ్లిపోతాడు.
శివనారాయణ కుటుంబాన్ని గుడిలోంచి అవమానించేలా మాలిని ప్లాన్ చేసిందేమోనని కార్తీక్, దీప అనుమానిస్తారు. లేదంటే గుడి ధర్మకర్తకు ఇక్కడ వీళ్లు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది. తెలిసినా వచ్చి అంతలా మాట్లాడాల్సిన అవసరం రాదు. కచ్చితంగా మాలినియే ఇలా చేస్తుంది. ఇలాగే తాతను అవమానిస్తే.. తాత అవమానభారంతో చనిపోతాడు దీప. కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలి. అంటూ కార్తీక్ తన ఐడియా దీపకు చెప్తాడు. వెంటనే ఇలా చేసి అందరినీ మన ఇంటికి తీసుకెళ్లాలి దీప. లేదంటే వెళ్లిన ప్రతిచోట ఇలాగే అవమానం చేయిస్తుంది మాలిని పిన్ని అని చెప్పగానే.. దీప కూడా సరే బావ ఇలాగే చేద్దాం.. ఎలాగైనా తాత, అమ్మ వాళ్లను ఇంటికి తీసుకెళ్దాం అని చెప్తుంది. ఇద్దరు కలిసి శివనారాయణ ఉన్న వాళ్ల దగ్గరకు వెళ్తారు.
ఆ చుట్టు పక్కల ఉన్న వాళ్లను తమ మాటలతో కన్వీన్స్ చేసి పెద్ద మనుషులుగా నటించమని చెప్తాడు కార్తీక్. అలాగే తన ఫ్రెండ్ ఫోలీస్‌కు ఫోన్ చేసి టైంకు అక్కడకు వచ్చి నటించమని చెప్తాడు. కార్తీక్ ఫ్రెండ్ సరే అంటాడు. ఇక కార్తీక్, శివనారాయణ దగ్గరకు వెళ్లి నాటకం మొదలు పెడతాడు. చుట్టూ తను ముందు చెప్పిన వ్యక్తులను పిలిచి గొడవ చేస్తుంటాడు. శివనారాయణ ఏంట్రా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని అడిగితే.. ఏంటి తాత ఇది చిన్న గొడవలకే ఇలా వచ్చేస్తే ఎలా..? కార్తీక్ చెప్పిన పెద్ద మనుషులు ఏంటి..? ఏమైంది అంటూ ప్రశ్నిస్తే.. వీళ్లు నా భార్య కుటుంబం.. ఆయన నా భార్య తాత.. వాళ్లు నా భార్య కన్నతల్లిదండ్రులు.. ఆవిడ నా భార్య చెల్లి, నానమ్మ.. ఇప్పుడు ఏదో చిన్న గొడవకి వీళ్లు మా ఇంటికి రావడం లేదు అని కార్తీక్ చెప్తుంటే..
జ్యోత్స్న బావ వదిలేయ్ అంటే ఎలా వదిలేస్తాను నువ్వు బాధపడుతున్నావని అక్కడ మీ అక్క బాధపడుతుంది అంటూ చెప్తుంటే.. కార్తీక్ అరైంజ్ చేసిన పెద్ద మనుషులు శివనారాయణ వాళ్లను కార్తీక్ వెంట వెళ్లమని చెప్తారు. అప్పుడే కార్తీక్ చెప్పిన పోలీస్ ఎంట్రీ ఇస్తాడు. శివనారాయణ దగ్గరకు వెళ్లి ఈ కాలంలో దొంగలు పెరిగిపోయారు. అందువల్ల ప్రతి ఒక్కరిని దొంగల్లా అనుమానించాల్సి వస్తుందని.. మీరు ఇలా రోడ్ల మీద తిరగొద్దని లేదంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుందని మీ మనవడితో పాటు వెళ్లిపోండని చెప్తాడు. దశరథ, పారు వెళ్దామని చెప్పగానే.. శివనారాయణ సరే అంటాడు. అందరూ కార్తీక్ ఇంటికి వెళ్తారు. పోలీస్ వెంటే ఇంటి దాకా వెళ్లి ప్రతిరోజు వీళ్లు ఇక్కడే ఉన్నారని నాకు ఉదయం సాయంత్రం నువ్వు మెసేజ్ చేయాలి అంటూ కార్తీక్‌కు చెప్పి వెళ్లిపోతాడు.
ఇంటికి వెళ్లిన సూరజ్, మాలినితో ఎందుకు శివనారాయణ ఫ్యామిలీని అంత టార్గెట్ చేశావు అంటూ నిలదీస్తాడు. వాళ్లను అవమానించాలనుకున్నాం అవమానించాం ఇంకా పగ సాధించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తాడు. సూరజ్ మాటలకు మాలిని షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.