BigTV English

KITE DEATHS : ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. నిషేదం విధించినా జోరుగా అమ్మకాలు..

KITE DEATHS : మాంజా.. పంజా విసురుతోంది.. రోడ్డుపై వెళ్లేవారి గోంతులను చీల్చుతూ వారి ప్రాణాలను తీస్తోంది. చైనా మంజాతో గాలిపటం ఎగరేసినా.. ఎగరవేయకున్నా.. ప్రజల ప్రాణాలు తీస్తోంది గాలిపటం. వేరు వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి గాలిపటాలు. సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగురవేయాలన్నది అందరి సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. కొందరి అత్యుత్సాహం మరికొందరి ప్రాణం తీస్తుంటే.. కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాలనే తీస్తూ వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.

KITE DEATHS : ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా.. నిషేదం విధించినా జోరుగా అమ్మకాలు..

KITE DEATHS : మాంజా.. పంజా విసురుతోంది.. రోడ్డుపై వెళ్లేవారి గోంతులను చీల్చుతూ వారి ప్రాణాలను తీస్తోంది. చైనా మంజాతో గాలిపటం ఎగరేసినా.. ఎగరవేయకున్నా.. ప్రజల ప్రాణాలు తీస్తోంది గాలిపటం. వేరు వేరు ఘటనల్లో ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి గాలిపటాలు. సంక్రాంతి సందర్భంగా గాలిపటం ఎగురవేయాలన్నది అందరి సరదా. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. కొందరి అత్యుత్సాహం మరికొందరి ప్రాణం తీస్తుంటే.. కొందరి నిర్లక్ష్యం వారి ప్రాణాలనే తీస్తూ వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు.


హైదరాబాద్‌ అల్వాల్‌లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ, ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి పడి ఆకాష్‌ అనే 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం ఏర్పడింది. హైదరాబాద్‌లో గాలిపటాలు ఎగురవస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు పెరగ్గా… చైనా మాంజా కారణంగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్ నాగోల్‌లో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ 4 అంతస్తుల భవనం పైనుంచి పడిపోయి, 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. స్నేహితులతో కలిసి బిల్డింగ్ పైకి వెళ్లిన శివకుమార్ గాలిపటాలు ఎగురవేస్తుండగా.. ఓ కుక్క అరుస్తూ పిల్లలపైకి వచ్చింది. కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివకుమార్ భవనం పైనుంచి పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. అత్తాపూర్‌లో కరెంట్‌ షాక్‌తో ఓ బాలుడు చనిపోగా.. నాగోల్‌లో భవనం పైనుంచి పడి శివకుమార్‌ ప్రాణాలు కోల్పోయాడు.


హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో సంక్రాంతి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీలో పని చేసే కోటేశ్వర్‌ రెడ్డి అనే జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి విధులకు వెళ్తుండగా చైనా మాంజా మెడకు తగలడంతో కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయనకు తోటి సిబ్బంది కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కోటేశ్వర్ రెడ్డి లంగర్‌ హౌస్‌లో నివాసం ఉంటూ ఆర్మీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జోగిపేటలోనూ సంక్రాంతి పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. సుబ్రమణ్యం సరదాగా పిల్లలతో కలిసి గాలిపటం ఎగురవేస్తుండగాగా పతంగి మంజా కరెంట్ హైటెన్షన్ వైర్లకు తగిలాయి. వైర్ల నుండి గాలిపటాన్ని తీస్తుండగా సుబ్రమణ్యానికి కరెంట్ షాక్ తగలడంతో ఒక్కసారిగా సుబ్రమణ్యం బిల్డింగ్‌పై నుండి కిందకు పడిపోయాడు.

గాయాలతో రక్తస్రావం కావడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలో సుబ్రమణ్యం ప్రాణాలను కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడికి ఇద్దరు పిల్లలు. మృతుడి స్వస్థలం కృష్ణాజిల్లా కోరగంటి పాలెం. ఇస్నాపూర్ లో ఫార్మసీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

నిజానికి చైనా మాంజా అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించిన మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోంది. ప్రభుత్వ ఆదేశాలను
వ్యాపారులు అస్సలు పట్టించుకోలేదు. అయినా కానీ అమ్ముతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. అసలు నిబంధనల అమలుపై అధికారులు దృష్టి పెట్టరా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

Tags

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×