E-Paper
Advertisement

Sankranti Celebrations : ఘనంగా సంక్రాంతి సంబరాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు..

Sankranti Celebrations : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరూ వాడలా పండుగ సందడి నెలకొంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలు, గుండాటలు, కోడిపందేలతో ఎటు చూసినా ఫెస్టివల్ కోలాహలం కనిపిస్తోంది. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నవారంతా సొంత ఊరికి చేరుకుని సంబరాల్లో మమేకవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు ఫేమస్‌. అందుకే ఎప్పటిలాగానే పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. అటు ఈ కోడిపందాలపై హైకోర్టు కూడా నిషేధం విధించింది. కోడి పందేలు నిర్వహించడం మూగ జీవాలపై క్రూరత్వమేనని.. వాటిని నిలువరించాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.

Advertisement

అయితే,.. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పలుమైదానాల్లో బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో కోడి పందేల జాతర సాగుతోంది. పలు చోట్ల పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్‌కాస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు సైతం ఈ పోటీలను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ పందేలను చూడడానికి ఏపీ నలు మూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివచ్చారు. దీంతో బరుల వద్ద పెద్ద ఎత్తున జన కోలాహాలం నెలకొంది.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×