E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy : ఫిబ్రవరి నుంచి ఉచిత విద్యుత్‌ హామీ అమలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..

Komatireddy Venkat Reddy : ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్‌ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమ‌లుపై కమిటీ చర్చించింది.

అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రతి హామీని నేర‌వేర్చుతామన్నారు. వంద రోజుల్లో హామీలన్ని అమ‌లు చేసి తీరుతామన్నారు. కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు.

Advertisement

నిరుద్యోగ భృతి మొద‌లుకొని డ‌బుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల వ‌ర‌కు అన్ని హామీల‌ను గత ప్రభుత్వం విస్మరించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి జోష్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాల‌పై విచార‌ణ కొన‌సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×