Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి మంత్రి పదవి వరించింది. ఆయన మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. 1999 నుంచి వరసుగా నాలుగుసార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా జయభేరి మోగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తొలిసారి 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భవనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. తాజా ఎన్నికల్లో నల్గొండ నుంచి 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మంత్రి పదవి దక్కడంతో నలుగురు ముఖ్యమంత్రుల కేబినెట్ చోటు దక్కించున్న నేతగా అరుదైన ఘనత సాధించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రొఫైల్..
యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం
1999, 2004, 2009, 2014లలో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా బాధ్యతలు
కిరణ్ కుమార్ మంత్రివర్గంలో మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రిగా బాధ్యతలు
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో ఓటమి
2019లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపు
2022 నుంచి టీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు
2023లో కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం
2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నిక