Uttam Kumar Reddy : నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా వరుసగా 6 సార్లు గెలిచిన చరిత్ర ఆయనది. 2018లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా 6వసారి విజయం సాధించినా.. ఆ తర్వాత జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీకి దిగి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రొఫైల్..
1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం
ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత
1999, 2004 ఎన్నికల్లో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం
2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
2019 సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపు
2004-2009 వరకు పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్
2009-2012 వరకు ఉమ్మడి ఏపీ శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్
2012-2014 వరకు గృహ నిర్మాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
2015 నుంచి 2021 వరకు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు