E-Paper
Advertisement

మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!

మద్దతు ఉంటే సరిపోదు.. అది ఓటుగా మారాలి.. క్యాడర్‌కు కోమటిరెడ్డి క్లాస్!
Advertisement

Komatireddy Venkat Reddy: కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన ఎస్.ఐ.ఆర్ (Special Intensive Revision)తో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ బూత్ లెవెల్ ఏజెంట్స్ తో ఎస్.ఐ.ఆర్ పై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పోరాటానికి ప్రతీ ఓటర్లను కాపాడుకునే బాధ్యతకు సిద్ధం కావాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడం కోసం ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

బీజేపీ ఓటు చోరీతో పాటు సీటు చోరీ కూడా తెలుసని ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ లో ఆమె రాజ్యసభ నామినేషన్ ను అడ్డుకోవడం దారుణమన్నారు. బీజేపీకి బలం లేని చోట మూడో అభ్యర్థిని పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని మండిపడ్డారు. మరోవైపు ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకుండా చూసుకోవాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

ప్రతి బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ ను కలవాలని.. ఫారాలను సక్రమంగా నింపేలా సహాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు ఉంటే సరిపోదని.. ఆ మద్దతు ఓటుగా మరల్చాల్సిన విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. అందుకే బూత్ స్థాయిలో జరిగే ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని కోమటిరెడ్డి అన్నారు. కాబట్టి జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే ఇంటింటి గణనను అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.

Also Read: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్.. షోకాజ్ నోటీసులు జారీ

Advertisement

జూలై 31న ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత ప్రతి పేరును పరిశీలించి.. ఎక్కడైనా పొరపాటు ఉంటే వెంటనే అభ్యంతరాలు దాఖలు చేయాలని కోమటిరెడ్డి సూచించారు. ప్రతి బూత్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే ముందుగా ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండాల్సిందేనన్నారు. ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా వృథా కాకూడదని పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్.ఐ.ఆర్ జరిగిన రాష్ట్రాల్లో అధికార పక్షానికి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని.. కాబట్టి ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మంత్రి చెప్పుకొచ్చారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×