E-Paper
Advertisement

Inzamam-ul-Haq : మా మ‌గాళ్ల వ‌ల్ల కాలేదు, మీరైనా టీమిండియాను చిత్తుగా ఓడించండి

Inzamam-ul-Haq :  మా మ‌గాళ్ల వ‌ల్ల కాలేదు, మీరైనా టీమిండియాను చిత్తుగా ఓడించండి
Advertisement

Inzamam-ul-Haq :  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Womens T20 World Cup 2026 ) నిన్న ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. అయితే పాకిస్తాన్ అటు టీమిండియా రెండు ఒకే గ్రూప్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women) మధ్య జూన్ 14 అంటే రేపు ఆదివారం రోజున మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఎడ్జ్ బస్టన్ వేదికగా (Edgbaston, Birmingham) మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఈ త‌రుణంలోనే ఇంజ‌మామ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మా మ‌గాళ్ల వ‌ల్ల కాలేదు, మీరైనా టీమిండియాను చిత్తుగా ఓడించండి అంటూ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

ఇండియాను ఓడించి, అల్లాకు గిఫ్ట్ ఇవ్వండి – ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ 

Advertisement

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంటులో ( ICC Womens T20 World Cup 2026 ) భాగంగా టీమిండియా వర్సెస్ మహిళల పాకిస్తాన్ (India Women vs Pakistan Women) జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా పురుషుల పాకిస్తాన్ జట్టు వల్ల కాలేదు.. కానీ మీరు మాత్రం టీమిండియాను ఓడించండి అంటూ మహిళల జట్టుకు దిశా నిర్దేశం చేశారు. పురుషుల పాకిస్తాన్ జట్టు ఎన్నో సంవత్సరాలుగా టీమిండియాను ఓడించేందుకు కసరత్తులు చేసిందని.. కానీ ఎప్పుడు సక్సెస్ కాలేదని గుర్తు చేశారు.

అయితే ఇప్పుడు జరిగే మహిళల టి20 ప్రపంచ కప్ ( T20 World Cup 2026 )  సందర్భంగా మాత్రం టీమిండియాను ( Team India) ఓడించే అవకాశం మహిళలకు వచ్చిందని గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీమిండియాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. టీమిండియాను ఓడించి అల్లాకు గిఫ్టుగా ఇవ్వండి అంటూ ఇంజ‌మామ్ ఉల్ హ‌క్ (Inzamam-ul-Haq )  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడిస్తున్నామన్న బలుపుతో ఇండియన్స్ రెచ్చిపోతున్నారని ఆగ్రహించారు. అలాంటి వాళ్ల పొగరు దించాలని మహిళల పాకిస్తాన్ జట్టుకు దిశ నిర్దేశం చేశారు ఇంజమాం. మీరు గనక ఓడిపోతే… పాకిస్తాన్ ప్రజలు తలదించుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఇంజ‌మామ్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. తలకిందులుగా తపస్సు చేసినా, టీమ్ ఇండియాను ఓడించడం పాకిస్తాన్ తరం కాదంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

 

Related News

టీమిండియాతో మ్యాచ్‌..భ‌య‌ప‌డి పారిపోయిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

Big Stories

Advertisement
×