E-Paper
Advertisement

జెన్ జీ బ్యాచ్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. వాళ్ల లెక్కే వేరు!

జెన్ జీ బ్యాచ్‌ని తక్కువ అంచనా వేయొద్దు.. వాళ్ల లెక్కే వేరు!
Advertisement

Gen Z Facts:జెన్ జీ .. జెన్ జీ .. జెన్ జీ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.అలాంటి ఈ జెన్ జీ పిల్లలు గురించి కొన్ని నిజాలు మీకు తెలుసా?వీళ్ళ ఆలోచనలు మిగతా జనరేషన్ ల కంటే చాలా డిఫరెంట్ అని పసిగట్టారా?లేకపోతె చూసేద్దాం రండి.

‘ఈ జనరేషన్ పిల్లలు ఉన్నారే అసలు వారి మాట వినదు ఎప్పుడు మా టైంలో అయితే ఇలా ఉండేదే కాదు ..’అంటూ జెన్ జీ .. పిల్లల గురించి చాలా కామెంట్లు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి.నిజానికి వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోకుండా తిట్టడం సరైనది కాదు.ఎందుకంటే ఈ తరం పెరిగింది, పెరుగుతుంది టెక్నాలజీ, ఇంటర్నెట్, సోషల్ మీడియా,ఏఐల మధ్యనే.అందుకే వాళ్ళ ఆలోచనలు అలవాట్లు కెరియర్ పై ఉన్న ఒపీనియన్స్ అన్ని పూర్తిగా మారిపోయాయి మరి.

Advertisement

ఫోన్ వాళ్ళకి ఆట బొమ్మ కాదు

ఫోన్ వాళ్ళకి ఆట బొమ్మ కాదు అది ఓ ప్రపంచం.అవును పెద్ద వాళ్లకు మొబైల్స్ అంటే కాల్స్ అండ్ మెసేజెస్ మాత్రమే.కానీ జెన్ జీ ..కి అదే ఒక క్లాస్ రూమ్, అదే ఆఫీస్ అదే ఎంటర్ టైన్ మెంట్.అదే ఇన్కమ్ ఇచ్చే ఒక పెద్ద సోర్స్ .చదువు నుంచి డబ్బు సంపాదించే వరకు  అన్ని పనులని వాళ్ళ ఫోన్లలోనే చేసేస్తున్నారు మరి.

Advertisement

ఇక డిగ్రీ కంటే స్కిల్ కి ఎక్కువ విలువ ఇస్తారు వీళ్ళు.ఒకప్పుడు మనకు ఎలా ఉండేది డిగ్రీ సంపాదిస్తే చాలు జీవితం సెట్ అయిపోతుంది అనుకునే వాళ్ళం.కానీ ఇప్పుడు నాకు ఏ స్కిల్ ఉంది దాంతో నేనేం చేయగలను దాంతో ఎలా సంపాదించగలను ..వీటి చుట్టే  ఈ జెన్ జీ .. ల ఆలోచనలన్ని.

9 టు 5 జాబ్ మా వల్ల కాదు బాబోయ్

ఇక ఒకప్పుడు 9 టు 5 జాబ్ చేశామన్నట్టుగా ఉండేది .కానీ ఈ పిల్లలు అసలు 9 టు 5 జాబ్ అంటేనే మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారు.ఎందుకంటే ఎవరి దగ్గర చేయడం కన్నా సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఆలోచన, తపన .స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్…ఇలా కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ ఇన్కమ్ ని వెనకేసే పనిలో  పడ్డారు

మిలియన్ వ్యూస్ వెనక్కి వేస్తే  చాలు

చాలామందిలో AI  ఉద్యోగాలు తీసేస్తుంది అనే భయం ఉంది. కానీ జెన్ జీ  మాత్రం దాన్ని నేర్చుకుని  ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనలో ఉంది .ఇక ఒక్క వీడియోతో జీవితమే మారిపోతుందని నమ్ముతున్నారు ఈ జెన్ జీ పిల్లలు.ఒక రీల్ వైరల్ అయితే చాలు ఒక వీడియో మిలియన్ వ్యూస్ వెనక్కి వేస్తే  చాలు జీవితం మారిపోతుందని  నమ్ముతోంది.

అందుకే చాలామంది చిన్న వయసులోనే కంటెంట్ క్రియేషన్ లోకి వచ్చేస్తున్నారు .వీటికి అనేక ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి కూడా.ఇక చాలామంది ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు. కేవలం ఎందుకు ఎలా అనేది కాకుండా దానివల్ల ఏం  ఉపయోగం అంటూ అడిగి మరీ తెలుసుకుంటున్నారు.

మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం 

ఇక ఇంతకుముందు ఒత్తిడి, ఆందోళన ,డిప్రెషన్ వంటి విషయాలను ఏవి బయటకు చెప్పేవాళ్ళం కాదు.కానీ ఈ జెన్ జీ  యూత్ మాత్రం ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యమని నమ్ముతోంది.అందుకే మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడు ఓపెన్ గా డిస్కషన్ పెట్టేస్తుంది.అన్నింటి కన్నా ముఖ్యంగా అసలు  వయసు అనేది డబ్బు సంపాదించడానికి ఏమాత్రం అడ్డంకి కాదు అంటున్నారు ఈ జెన్ జీ బ్యాచ్.

16. 17 ఏళ్లకే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ,ఫ్రీలాన్సింగ్,గేమింగ్, AI…లని వాడేస్తూ డబ్బులు సంపాదించేస్తున్నారు .ఇపుడు ప్రపంచం మొత్తం వాళ్ళ క్లాస్ రూమే.ఒకప్పుడు పుస్తకాలలో ఏది ఉంటే అదే జ్ఞానం కానీ ఇప్పుడు యూట్యూబ్, ఆన్ లైన్ కోర్స్,  AI టూల్స్, వెబినార్లు.. ఇలా కొత్త కొత్త క్లాస్ టీచర్లు కొత్త కొత్త టీచర్లు పుట్టుకొచ్చేశారు.

మొబైల్ ఫోన్ తో లైఫ్ సెట్ 

అన్నింటి  కన్నా ముఖ్యంగా ఈ తరం పిల్లలు తాము చెప్పేదాన్ని అవతలి వాళ్ళు కచ్చితంగా వినాలని కోరుకుంటారు.మీరు ప్రేమగా మాట్లాడితే వెంటనే అర్థం చేసుకుంటారు. అలా కాదు అని వాళ్ళని ఆర్డర్లో పెట్టాలని డామినేషన్  చేయాలని చూస్తే మాత్రం వాళ్లు మన మాట వినకుండా దూరంగా  పోయే ప్రమాదం ఉంది.

సో జెన్ జీ అర్థం చేసుకోవాలంటే వాళ్లు ఆ ఫోన్లో ఏం చేస్తున్నారు ,ఏం నేర్చుకుంటున్నారు, ఏం క్రియేట్ చేస్తున్నారు, అసలేం సంపాదిస్తున్నారు అనేది కూడా చూడాలి.ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు .కొంతమంది మొబైల్ ఫోన్స్ తో టైం పాస్ చేస్తుంటే ,చాలా మంది అదే మొబైల్ ఫోన్ తో లైఫ్ ని సెట్  చేసుకుంటున్నారు.

ప్రతి తరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.Gen Z ప్రత్యేకత ఏంటంటే… మార్పును చాలా వేగంగా అంగీకరిస్తుంది. కొత్త టెక్నాలజీని వెంటనే నేర్చుకుంటుంది. అవకాశాలను వెతుక్కుంటుంది. అందుకే ఈ తరం గురించి విమర్శించే ముందు… వాళ్ల ప్రపంచాన్ని ఒకసారి అర్థం చేసుకోవడం మంచిది.మరి అర్థం చేసుకుంటారు కదూ !

Related News

స్నేహితులు దూరంగా ఉన్నారా? ఫ్రెండ్ షిప్ డే సెలెబ్రేట్ చేసుకునేందుకు క్రియేటివ్ ఐడియాలు ఇవిగో

వైట్ వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి వాడితే.. అద్భుతమైన ఫలితాలు చూస్తారు!

ఫ్రిడ్జ్ డీఫ్రాస్ట్ చేయడానికి టెక్నీషియన్లు చెప్పే బెస్ట్ చిట్కా.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది!

ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే టాయిలెట్ పేపర్ రోల్‌తో ఇలా చెక్ పెట్టండి!

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముతారు.. ఈ తేదీల్లో పుట్టినవారు విధితో పోరాడి విజయం సాధిస్తారు

తెల్ల జుట్టు ఆరోగ్యానికి మంచిదే.. ఆ ప్రమాదకర వ్యాధి నుంచి రక్షణకు సూచన

కర్రీలో నూనె ఎక్కువైందా? రుచి కాపాడడానికి ఈ 5 టిప్స్

Big Stories

Advertisement
×