E-Paper
Advertisement

రూటు మార్చిన కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణలు, జగన్ సలహాతోనే! జాయినింగ్ ఎప్పుడు?

రూటు మార్చిన కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణలు, జగన్ సలహాతోనే! జాయినింగ్ ఎప్పుడు?
Advertisement

Telangana Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని రోజులివి. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు. కేటీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉన్నట్లుండి ఆమె యూ టర్న్ తీసుకోవడంతో నేతల్లో అప్పుడే చర్చ మొదలైంది.

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చ

రాజకీయాల్లో రాణించాలని భావించేవారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. నోరు ఉందని కాస్త దూకుడుగా వెళ్తే కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే. చాలామంది నేతలు ఆ విధంగా ఇరుక్కుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. ఈలోగా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కబురు రావడంతో ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. లేటెస్టుగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.

రూటు మార్చిన కొండా సురేఖ, కేటీఆర్‌కు క్షమాపణలు

Advertisement

కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మాజీ మంత్రి కొండా సురేఖ. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ విధంగా మాట్లాడానని రాసుకొచ్చారు. ఉద్దేశపూర్వకంగా కాదని, నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్నారు.  కేటీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని బాధపెట్టాలనే ఆలోచన లేదన్నారు. వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశం లేదని బయటపెట్టారు. నా వ్యాఖ్యలు వారిని, కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టివుంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.

ALSO READ: నిరుద్యోగులకు పండగ.. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC, శుక్రవారం నుంచే

Advertisement

ఉన్నట్లుండి కొండా సురేఖ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పడంపై తెలంగాణ రాజకీయాల్లో చిన్నపాటి చర్చ అప్పుడే మొదలైంది. కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న ఆమె, సడన్‌గా ట్వీట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో ఆమెకు జగన్ నుంచి వర్తమానం వచ్చినట్టు ఉంటుందని, అందుకే ఆ విధంగా ఎక్స్‌లో రాసుకొచ్చని నేతలు చర్చించుకోవడం మొదలైంది.

ఎందుకంటే తెలంగాణలో యాక్టివ్ కావాలని వైసీపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. సరైన నాయకులు లేకపోవడంతో వెనక్కి తగ్గింది. రేపో మాపో అమరావతి నుంచి హైదరాబాద్‌కు జగన్ మకాం మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ విధంగా రాసుకొచ్చారని అంటున్నారు. మొత్తానికి కొండా సురేఖ గురించి రానున్న రోజుల్లో ఇంకెన్ని వార్తలు చక్కర్లు కొడతాయో చూడాలి.

 

Related News

పంట పొలాల్లో మొసలి నానాహంగామా.. రైతులు ఎలా పట్టేశారు? మెదక్ జిల్లాలో ఘటన

నిరుద్యోగులకు పండగ.. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC, శుక్రవారం నుంచే..

బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!

కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై లైంగిక దాడి.. ఎక్కడంటే?

బియ్యం ధరల పై నియంత్రణ.. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం మాస్ వార్నింగ్!

కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు!

సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద టీపీసీసీ మెరుపు ధర్నా..!

Big Stories

Advertisement
×