E-Paper
Advertisement

నిరుద్యోగులకు పండగ.. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC, శుక్రవారం నుంచే..

నిరుద్యోగులకు పండగ.. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC, శుక్రవారం నుంచే..
Advertisement

TGPSC Notification: తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. 102 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 30 అనగా శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పుడు వాటి వివరాలను చూద్దాం.

తెలంగాణలో నిరుద్యోగులకు పండగ

నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్‌ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 102 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్- MPSO, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-ASO కేడర్ ఉద్యోగాల భర్తీ చేయనుంది.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

Advertisement

ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక పోర్టల్ ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. అక్టోబర్ 30 నుంచి (రేపటి నుంచి) నవంబర్ 27 వరకు దరఖాస్తులను తీసుకుంటారు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 44 సంవత్సరాల గల అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ వారీగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉండనుంది.

ALSO READ: బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!

Advertisement

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం, కళాశాల నుంచి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ పాసై ఉండాలి. సిలబస్, పరీక్ష విధానం, ఖాళీల కేటాయింపు, ఇతర సమాచారం కోసం టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Related News

బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!

కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై లైంగిక దాడి.. ఎక్కడంటే?

బియ్యం ధరల పై నియంత్రణ.. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం మాస్ వార్నింగ్!

కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు!

సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద టీపీసీసీ మెరుపు ధర్నా..!

ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

అలియాబాద్‌ మున్సిపాలిటీలో అక్రమ షెడ్ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×