Medak: విష పూరిత జంతువులు ఒకప్పుడు అడువుల్లో ఉండేవి. పరిస్థితులు మారాయి.. కాలం కూడా మారిపోయింది. ఎల్‌నినో కారణంగా వర్షాలు అల్లాడిపోతున్నాయి జంతువులు. ఫలితంగా మానవులు ఉండే చోటికి వచ్చేస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఓ మొసలి నానాహంగామా చేసింది.
ఎల్ నినో ప్రభావం మానవులకే కాదు.. జంతువులకు సెగ తగులుతోంది. వర్షాలు లేకపోవడంతో విష జంతువులు అడవుల నుంచి జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలం తెలంగాణలో జంతువులు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు నీటిలో ఉండే జంతువుల వంతైంది. ఎల్ నినో దెబ్బకు చెరువులు, జలాశ్రయాలు ఖాళీ అవుతున్నాయి. బయటకు రాని జంతువులు పంట పొలాల్లోకి చొరబడుతున్నాయి.
తాజాగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎనికెపల్లి గ్రామ శివార్లలోని పంట పొలాల్లో మొసలి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారి మొసలిని చూసిన రైతులు పంట పొలాల నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు పంట పొలాలకు తరలివచ్చారు. మరోవైపు స్థానికులు, రైతులు తోడు కావడంతో అతి కష్టంమీద మొసలిని బంధించారు.
దాదాపు గంటన్నరపాటు మొసలిని బంధించేందుకు నానా ప్రయత్నాలు చేసి చివరకు సక్సెస్ అయ్యారు. మొసలిని పట్టుకోవడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బలమైన తాళ్లతో మొసల్ని కట్టేసారు. దాన్ని గన్నీ బ్యాగ్‌లో వేశారు. అక్కడి నుంచి నేరుగా రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: రూటు మార్చిన కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణలు, జగన్ సలహాతోనే! జాయినింగ్ ఎప్పుడు?
మంజీరా నది నుంచి మొసలి వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. గతంలో మంజీరాలో మొసళ్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మొసలి పట్టుబడడంతో నిజమేనని అంటున్నారు.
Medak: Crocodile spotted in farm near Enkepally
Farmers and villagers were alarmed after a crocodile was spotted in an agricultural field on the outskirts of Enkepally village in Papannapet mandal of Medak district.
Following information from the forest department, a rescue… pic.twitter.com/iJ1UMWXRfS
— Sudhakar Udumula (@sudhakarudumula) October 29, 2026