Mahesh Kumar: బీజేపీ వైఖరిపై టీపీసీసీ ఉగ్రరూపం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. భేష్ మహేశ్..! అని కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రశంసించగా.. ఇలాంటి స్పూర్తినే మేం కోరుకుంటున్నాం అధ్యక్షా ! అని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు మహేశ్ భుజం తట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… నబంబర్ 1న ఢిల్లీలో ఇండీ కూటమి భారీ నిరసన తెలియజేసేందుకు రెడీ అయ్యింది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యారు. వీరితో పాటు ఇక్కడి యువతను కూడా పెద్ద ఎత్తున తరలించాలని టీపీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. దీని కోసం ప్రత్యేక రైళ్లను కేటాయించాలని రైల్వే శాఖను కోరింది. దీన్ని చివరి దాకా పెండింగ్‌లో పెట్టిన రైల్వే శాఖ బుధవారం రైళ్లను కేటాయించేందుకు అనుమతిని తిరస్కరించింది.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్ నిలయాన్ని ముట్టడించారు. మోడీ డౌన్ డౌన్ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫర్నిచర్ ధ్వంసమయ్యింది. అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తున్న మహేశ్‌ను పోలీసులు బలవంతంగా లాగేశారు. ఆయనను గట్టిగా పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ శ్రేణలంతా మహేశ్‌పై పడిపోయారు. దీంతో ఆయనపై తీవ్ర ఒత్తిడి పెరిగి తీవ్ర గాయాలయ్యాయి.
అయినా అక్కడ నుంచి కదలకుండా మోడీకి వ్యతిరేకంగా మహేశ్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైళ్ల అనుమతులు అడ్డుకోగలరేమో గానీ, తమను అడ్డుకోలేరని, లక్షలాదిగా ఢిల్లీ చేరుకుని కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగడతామని మహేశ్ అన్నారు. టీపీసీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.పలువురు నేతలకు బస్సుల ద్వారా యువతను, క్యాడర్‌ను తరలించే బాధ్యతలను అప్పగించారు. అయితే ఢిల్లీలో జరగనున్న ‘ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి’ అనే నినాదంతో ఓట్ చోరీపై చేపడుతున్న ఆందోళనను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మహేశ్ చేపట్టిన మెరుపు ధర్నాతో ఈ నిరసన రూపానికి మరింత వేడి పెరిగింది. జాతీయ స్థాయిలో తెలంగాణ క్యాడర్ ఉద్యమంపై చర్చ జరిగింది. దీనికి నేతృత్వం వహించిన మహేశ్‌కు ఢిల్లీ పెద్దలు కితాబునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు కూడా మహేశ్ ఉద్యమస్పూర్తిని మెచ్చుకున్నారు.
Also read: శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో