E-Paper
Advertisement

బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!

బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ దాడుల కలకలం.. 10 లక్షల లంచంతో దొరికిపోయిన ఎస్సై!
Advertisement

ACB Trap: మన ప్రజాస్వామ్యంలో న్యాయం చాలా కాస్లీ గురూ.. అంత ఈజీగా అయితే దొరకదు. కోర్టులో లాయర్లకు ఫీజులు కట్టాలి.. పోలీస్‌ స్టేషన్లలో పోలీసులకు లంచాలు ఇవ్వాలి. లేదంటే ఫైల్ కదలదు. బెయిల్ రాదు. ఇక్కడ చట్టాన్ని కాపాడాల్సిన చేతులు. లంచం నోట్లను అందుకుంటున్నాయి. న్యాయం చేయాల్సిన టేబుల్ బేరసారాలకు అడ్డాగా మారింది.

సపోర్ట్ ఇస్తానని బేరం..

ఇదిగో ఇతని పేరు విజయ్. బంజారాహిల్స్ పీఎస్‌లో ఎస్సైగా డ్యూటీ చేస్తున్నాడు. రిచ్‌ ఏరియాలో ఎస్సై అంటే ఇతని చెప్పే రేట్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. తన పవర్‌ను పబ్లిక్ సర్వీస్‌కి కాకుండా, పర్సనల్ జేబులు నింపుకోవడానికి వాడేశాడు. ఒక చీటింగ్ కేసుకు సంబంధించి కేసు నుంచి బయటపడేస్తానని, నిందితుడికి ఫుల్ సపోర్ట్ ఇస్తానని బేరం పెట్టాడు. చిన్న అమౌంట్ కాదు.. ఏకంగా 10 లక్షలు ఇస్తేనే ఫైల్ క్లియర్ అవుతుందని ఓపెన్‌గా రేట్ మాట్లాడేశాడు.

Advertisement

Also Read: రైళ్లలో రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

ఇన్‌స్టాల్‌మెంట్‌గా 2లక్షలు..

రేటు ఎక్కువయ్యేసరికి ఆ బాధితుడికి మైండ్ బ్లాకైంది. పోలీసోడి ఆకలికి అంతులేకుండా పోవడంతో చివరికి బాధితుడు నేరుగా ACB అధికారుల తలుపు తట్టాడు. బాధితుడి కంప్లైంట్‌తో ఏసీబీ ఆఫీసర్లు రంగంలోకి దిగి. పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. బాధితుడు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా 2లక్షల రూపాయలను ఎస్సై విజయ్‌కి ఇవ్వడానికి వెళ్లాడు. పోలీస్ స్టేషన్ రూమ్‌లో ఆ డబ్బును తీసుకుని… ఎస్సై తన సొంత జేబులో వేసుకుంటున్న క్షణంలో అదృశ్య శక్తులలా ఏసీబీ టీమ్ సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

డిపార్ట్‌మెంట్ పరువు..

Advertisement

కదిలేందుకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆఫీసర్లు చుట్టుముట్టారు. చేతికి రంగు పూసిన నోట్లతో అడ్డంగా దొరికిపోయాడు ఎస్సై. ఆ టెన్షన్‌లో ఎస్సైకి చెమటలు కారిపోయాయి. డబ్బుతో సహా పట్టుబడిన ఎస్సై విజయ్‌ని ఏసీబీ అధికారులు ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే పీఎస్‌లో సోదాలు మొదలుపెట్టారు. ఇలాంటి డబ్బు పిచ్చోళ్లు యూనిఫామ్‌కి మచ్చ తెస్తూ డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వేరే ఉంది. కేవలం ఈ ఎస్సై ఒక్కడే ఈ స్కెచ్ వెనుక ఉన్నాడా? లేక ఈ లంచం బాగోతం వెనుక ఇంకా ఏ పెద్ద తలకాయలైనా ఉన్నాయా? పీఎస్‌లో ఉన్న మిగతా పెద్ద సర్కిల్ అధికారులకి ఇందులో వాటాలున్నాయా? ప్రస్తుతం ఇదే కోణంలో ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.

Also read: ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

Tags

Related News

కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై లైంగిక దాడి.. ఎక్కడంటే?

బియ్యం ధరల పై నియంత్రణ.. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం మాస్ వార్నింగ్!

కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు!

సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద టీపీసీసీ మెరుపు ధర్నా..!

ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

అలియాబాద్‌ మున్సిపాలిటీలో అక్రమ షెడ్ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

మేడ్చల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద నీటి వృథా.. పట్టించకోని అధికారులు!

Big Stories

Advertisement
×