E-Paper
Advertisement

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!
Advertisement

Waqar Younis  On Jasprit Bumrah: టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వ‌కార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో జస్‌ప్రీత్ బుమ్రాను కొట్టే మొనగాడు లేడని పేర్కొన్నాడు. వైట్ బాల్ క్రికెట్ లో యార్కర్లు వేయడంలో జస్‌ప్రీత్ బుమ్రా ఒక్కడే తోపు అంటూ ప్రశంసించాడు. ఈ విషయంలో పాకిస్తాన్ బౌలర్లందరూ వెధవలేనని… బుమ్రాను బీట్ చేసే దమ్ము ఎవరికీ లేదని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ టెస్టుల్లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా జీరో అంటూ ఎద్దేవా చేశాడు. టెస్ట్ క్రికెట్ లో అత‌డి కంటే మంచి బౌల‌ర్లు పాకిస్తాన్ జ‌ట్టులో ఉన్నార‌న్నాడు. టెస్ట్ క్రికెట్ లో జస్‌ప్రీత్ బుమ్రా మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. లేకపోతే కష్టమైన అని తెలిపాడు.

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

ప్రస్తుత తరంలో టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా నాణ్యమైన బౌలర్ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వ‌కార్ యూనిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి సమయాలలో వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా బుమ్రా రాణిస్తాడని వెల్లడించాడు. అందుకే జస్‌ప్రీత్ బుమ్రా కేవలం వైట్ బాల్ క్రికెట్ కు మాత్రమే షూట్ అవుతాడని పేర్కొన్నాడు. మ్యాచ్ ప్రత్యర్థి చేతిలో ఉన్నప్పటికీ.. యార్కర్లతో టర్న్ చేస్తాడని ప్రశంసించాడు. అలాంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు అరుదుగా దొరుకుతారని, అతడిని జాగ్రత్తగా టీమ్ ఇండియా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశాడు వ‌కార్ యూనిస్.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

కానీ టెస్ట్ క్రికెట్ లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా మరింత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వ‌కార్ యూనిస్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రెడ్ బాల్ క్రికెట్ లో కూడా అతడు అత్యున్నత బౌలర్ గా ఎదగడానికి ఛాన్స్ ఉందని… కానీ వైట్ బాల్ క్రికెట్ పైన అతడు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో విఫలమవుతున్నాడని తనకు అర్థమైంది అన్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా పదేపదే గాయాల బారిన పడుతున్నాడని తెలుస్తోందని చెప్పాడు. ఇలా గాయాల బారిన పడితే అతడి కెరీర్ త్వరగా ముగుస్తుందని హెచ్చరించాడు. ఈ విషయాన్ని బుర్రలో పెట్టుకొని ముందుకు సాగాల‌ని స్పష్టం చేశాడు. టెస్ట్ క్రికెట్ లో మిచెల్ స్టార్క్, జోష్ హేజల్ వుడ్, పాకిస్తాన్ , ఇంగ్లాండ్ బౌల‌ర్లు…జస్‌ప్రీత్ బుమ్రా కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వ‌కార్ యూనిస్ గుర్తు చేశాడు.

Advertisement

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

Related News

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

Big Stories

Advertisement
×