Hyderabad Crime: ఆమె పేరు దివ్య.. చేతిలో డిగ్రీ సర్టిఫికెట్లు, కళ్లల్లో ఆశలు, గుండెల్లో నమ్మకాన్ని మోసుకుంటూ హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ట్రై చేస్తోంది. ఆ వెతుకులాటలో ఒక మహిళతో పరిచయం అయ్యింది. తన భర్త హరి ద్వారా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. హరి మరో వ్యక్తిని పరిచయం చేశాడు. అతని పేరు ప్రశాంత్, హెచ్‌ఆర్ మేనేజర్ అంటూ బిల్డప్ ఇచ్చాడు. పైకి చూస్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ లాంటి సీన్. కానీ ఈ ముగ్గురి ప్లాన్ వేరే ఉంది.
ఆమె ఇంట్లోనే సీక్రెట్ కెమెరాలు పెట్టి, ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేశారట. ఆ వీడియోలు భర్తకు చూపిస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. భయంతో 16 తులాల బంగారం ఇచ్చేసింది. పైగా 8లక్షలు క్యాష్ తీసుకున్నారు. 6తులాల నెక్లెస్‌ను ప్రశాంత్ తాకట్టు పెట్టేశాడు. ఇంతటితో ఆగలేదు. జూన్ 8న దివ్యను ఫ్లాట్‌కు పిలిచి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపారని, స్పృహ కోల్పోయినప్పుడు హరి, ప్రశాంత్ లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపిస్తుంది. ఆ తర్వాత వీడియోలను ఆమె ఫోన్‌కే పంపించి మళ్లీ బెదిరింపులకు దిగారు.
గుండెల్లో ఎన్ని రాత్రులు నిద్రలేకుండా గడిచాయో ఎన్ని కన్నీళ్లు దిండులో ఇంకిపోయాయో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఒంటరిగా ఎలా పోరాడిందో ఆ నిశ్శబ్దానికే తెలుసు. అయినా ఒక రోజు ఆమె లేచి నిలబడింది. భయాన్ని దాటి, సిగ్గును దాటి, ఇది నా తప్పు కాదు అంటూ ధైర్యంగా పోలీస్ మెట్టు ఎక్కి జరిగిదంతా చెప్పింది. ఆమె కంప్లైంట్‌తో కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైంది, ఇప్పుడు కేసు కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పటికైతే ఆరోపణలే, దర్యాప్తులో నిజం తేలాల్సి ఉంది. రహస్య కెమెరాల ఫుటేజ్ ఎక్కడుంది? డబ్బు, బంగారం ఏమైంది? పోలీసుల విచారణలో ఏం బయటపడుతుందో చూడాలి.
Also read: దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?