E-Paper
Advertisement

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది
Advertisement

Tanveer Ahmed On Abhishek And Tilak:  పొద్దున లేస్తే టీమిండియా పై విషం కక్కే తన్వీర్ అహ్మద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ప్రతి నిత్యం అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ కాపాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు క్రికెటర్లే లేకపోతే టీమిండియా కుప్పకూలుతుందని హాట్ కామెంట్స్ చేశారు. టీమిండియా జట్టులో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ఆడడం లేదని… ఓపెర‌న్ గా వచ్చిన అభిషేక్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని పేర్కొన్నారు. మిడిల్ ఆర్డర్ లో వచ్చే తిలక్ వర్మ దుమ్ములేపుతున్నాడని చెప్పారు. మిగతా క్రికెటర్లు మాత్రం దద్దమ్మలే అని పరువు తీశారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆధ్వ‌ర్యంలోని టీమిండియా టి20 జట్టు బ‌లంగా త‌యారు కావ‌డానికి కార‌ణంగా ఈ ఇద్ద‌రూ మాత్ర‌మేన‌ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ స్ప‌ష్టం చేశారు.

స్లాగ‌రైనా అభిషేక్ హీరోనే – త‌న్వీర్ అహ్మ‌ద్

అభిషేక్ శర్మ పెద్ద స్లాగర్ అయినప్పటికీ.. సరైన సమయంలో జట్టుకు పరుగులు అందిస్తున్నాడని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యానించారు. భారత గడ్డపై మ్యాచ్ లు జరిగితే, అభిషేక్ శర్మను తట్టుకోవడం కష్టమేనని స్పష్టం చేశారు. అభిషేక్ శర్మ విఫలమైతే… మిడిల్ ఆర్డర్ లో వస్తున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రత్యర్థికి రంకు మొగుడి లాగా తయారయ్యాడని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే తిలక్ వర్మకు ఒక ఊపు వస్తుందని తెలిపారు. చాలా సార్లు పాకిస్తాన్ జట్టు ఓడిపోవడానికి కారణం తిలక్ వర్మనే అంటూ పేర్కొన్నారు.

Advertisement

Tilak Varma and Nitish Kumar Reddy Telugu conversation: తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, షాకింగ్ వీడియో వైర‌ల్

అభిషేక్ శర్మ, తిలక్ వర్మను ఔట్ చేస్తే టీమిండియా పని అయిపోయినట్టే

అభిషేక్ శర్మతోపాటు తిలక్ వర్మ ఇద్దరినీ త్వరగా ఔట్ చేస్తే టీమిండియా పని అయిపోతుందని త‌న్వీర్ అహ్మ‌ద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా టి20 జట్టులో ఈ ఇద్దరి వికెట్లు చాలా కీలకమ‌ని చెప్పాడు. ఇషాన్‌ కిషన్, సంజు శాంస‌న్‌ లాంటి వాళ్ళు ఆడితే ఆడతారు లేకపోతే లేదన్నారు. టీమిండియా భారం మొత్తం అభిషేక్ శర్మతోపాటు తిలక్ వర్మపైనే ప‌డుతోంద‌ని పేర్కొన్నాడు.

Advertisement

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తిలక్ వర్మ అలాగే అభిషేక్ శర్మ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అతడు చెప్పినట్లుగానే టీమిండియాకు ఈ ఇద్దరు మెయిన్ పిల్లర్స్ లాగా తయారయ్యారు. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న టి20 సిరీస్ లోనూ ఈ ఇద్దరి రాణించారు. మొదట్లో తిలక్ వర్మ అదరగొట్టగా మొన్న మూడో టి20 బంతుల్లో అభిషేక్ సెంచరీ చేసి దుమ్ము లేపాడు.

Faf du Plessis talks about Suryakumar Yadav catch of David Miller in T20 World Cup final: టీమిండియా ఛీటింగ్ చేసే గెలిచింది…సూర్య‌కుమార్ క్యాచ్ పై డుప్లెసిస్ సంచ‌ల‌నం!

 

 

 

Related News

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

శుభమాన్ గిల్ త‌ల‌కు ఏమైంది? ఆ ఎల‌క్ట్రిక్ డివైజ్ ఎందుకు పెట్టుకున్నాడు

బంతులు వేస్తే, బ్యాట‌ర్ల ముక్కు, ద‌వ‌డ‌ల‌ నుంచి ర‌క్తం రావాలి…షోయ‌బ్ అక్తర్ సంచ‌ల‌నం !

కాళ్లు మొక్కినా ఆ జ‌ట్టులోకి వెళ్ల‌ను…హార్ధిక్ పాండ్యా సంచ‌ల‌నం !

పాకిస్తాన్ తిక్క కుదిర్చిన ఇంగ్లాండ్..ఐపీఎల్ ఆడేందుకు జై కొట్టిన ప్లేయ‌ర్లు

తెరపైకి శాండ్ పేపర్ వివాదం..బౌండరీ లైన్ దగ్గర నాథన్ లైయన్ ఆడుకున్న ఫ్యాన్స్

Big Stories

Advertisement
×