E-Paper
Advertisement

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది
Advertisement

Revenge Thriller: ఓ కుటుంబాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసే ఓ రైలు ప్రమాదం… అది ప్రమాదం కాదని, ఎవరో కావాలనే చేసిన కుట్ర అని తెలిస్తే ? భార్యను కోల్పోయిన ఓ మిలిటరీ ఆఫీసర్ నిజం కోసం బయలుదేరితే… అతడితో కలిసి డేటా అనాలిసిస్ చేసే కొందరు విచిత్రమైన వ్యక్తులు కూడా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా మారుతుంది ? యాక్షన్‌ తో పాటు డార్క్ కామెడీ, ఎమోషన్, రివెంజ్‌ను కలిపిన కథే ‘రైడర్స్ ఆఫ్ జస్టిస్’ (Riders of Justice – 2020). మరి ఈ కిరాక్ రివేంజ్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఆఫ్ఘనిస్తాన్‌ లో విధులు నిర్వర్తిస్తున్న కఠినమైన సైనికుడు మార్కస్ కి ఓ విషాదకరమైన వార్త అందుతుంది. అతని భార్య, కూతురు మథిల్డే ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ఈ ఘటనలో భార్య చనిపోగా, కూతురు ప్రాణాలతో బయటపడుతుంది. దీంతో మార్కస్ వెంటనే ఇంటికి తిరిగి వచ్చి కూతురి బాధ్యత తీసుకుంటాడు. అయితే భార్యను కోల్పోయిన విషాదం నుంచి బయటపడటం అతడికి కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఆ ప్రమాదంలోనే ప్రయాణించిన ఒట్టో అనే గణిత శాస్త్రవేత్త మార్కస్‌ ను కలుస్తాడు. ప్రమాదం యాక్సిడెంటల్ గా జరగలేదని, అది రైడర్స్ ఆఫ్ జస్టిస్ అనే క్రిమినల్ గ్యాంగ్ చేసిన కుట్రలో భాగమని ఒట్టో అంచనా వేస్తాడు.

Advertisement

ఒక వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పకుండా అడ్డుకునేందుకు జరిగిన హత్యాయత్నంలో మార్కస్ భార్య అనుకోకుండా బలైందనేది అతడి వాదన. భార్య మరణానికి కారణమైన వారిని కనిపెట్టి శిక్షించాలనే కోపంతో మార్కస్ రంగంలోకి దిగుతాడు. ఒట్టోతో పాటు అతని స్నేహితులు లెన్నార్ట్, ఎమ్మెంతలర్ కూడా అతడికి తోడవుతారు. ఒకవైపు మార్కస్‌ కు ఉన్న సైనిక నైపుణ్యం… మరోవైపు వీళ్ల డేటా, టెక్నాలజీ, విచిత్రమైన ఆలోచనలు.. ఇలా ఊహించని కాంబినేషన్‌ తో ఓ చిన్న బృందం తయారవుతుంది. అయితే ఈ బృందం సాగించే ప్రతీకార వేటలో నవ్వించే సన్నివేశాలతో పాటు తీవ్ర భావోద్వేగాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మార్కస్ తన కూతురు మథిల్డే నుంచి మానసికంగా దూరమవుతుండటం కథలో మరో ఎమోషనల్ లేయర్‌ ను తీసుకొస్తుంది.

ఒట్టో, లెన్నార్ట్, ఎమ్మెంతలర్ మాత్రం ఆమెకు తాము ఒక థెరపీ బృందమని చెప్పి ఇంట్లోనే ఉంటూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంటారు. కానీ మార్కస్ నమ్ముతున్న ప్రతీకారం నిజంగానే సరైన దారిలో ఉందా ? ఒట్టో వేసిన లెక్కల్లో ఏదైనా పొరపాటు జరిగిందా ? రైలు ప్రమాదం వెనుక నిజంగా రైడర్స్ ఆఫ్ జస్టిస్ గ్యాంగ్ ఉందా, లేక ఇది మొత్తం ఓ పెద్ద అపార్థమా? నిజం బయటపడే సమయానికి మార్కస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? తన కూతురితో అతని బంధం ఏ మలుపు తిరుగుతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానాలే సినిమాను ఆసక్తికరంగా మార్చే అసలు పాయింట్.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

Advertisement

‘రైడర్స్ ఆఫ్ జస్టిస్’ ప్రస్తుతం జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు డబ్బింగ్‌ తో అందుబాటులో ఉంది. డార్క్ కామెడీ, యాక్షన్, రివెంజ్ డ్రామాతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా కలిసిన సినిమాలు ఇష్టపడేవారికి ఇది భిన్నమైన అనుభూతిని ఇవ్వొచ్చు. ముఖ్యంగా సాధారణ రివెంజ్ కథలా కాకుండా ఈ సినిమాకు ప్రత్యేకంగా ఉంటుంది.

Read Also: క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

Tags

Related News

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

Big Stories

Advertisement
×