E-Paper
Advertisement

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!
Advertisement

Cheque Bounce: బ్యాంకు ఖాతాలో సరిపడా నగదు లేకపోయినప్పటికీ చెక్కు జారీ చేసి, అది బౌన్స్ అయిన కేసులో ముద్దాయి దొడ్ల వెంకట రామయ్యకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ ఫిర్యాదుదారుడికి రూ.9 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కొత్తగూడెం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. రవికుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.

రూ.4 లక్షలు అప్పు..

కేసు పూర్వాపరాల్లోకి వెళితే, కొత్తగూడెంలో కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్న కోసిక శ్యామ్ వద్ద ముద్దాయి దొడ్ల వెంకటరామయ్య 2021 జనవరిలో తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.4 లక్షలు అప్పుగా తీసుకొని, అందుకు ప్రతిఫలంగా ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. అనంతరం అప్పు బకాయి చెల్లింపు నిమిత్తం 2022 అక్టోబర్ 31న రూ.5 లక్షల చెక్కును జారీ చేశారు. ఫిర్యాదుదారుడు శ్యామ్ సదరు చెక్కును బ్యాంకులో జమ చేయగా, ముద్దాయి ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో చెక్కు తిరస్కరణకు గురైంది.

నోటీసు జారీ..

Advertisement

ఈ మేరకు బ్యాంకు అధికారులు చెక్ రిటర్న్ మెమో జారీ చేశారు. దీంతో శ్యామ్ తన న్యాయవాది ద్వారా ముద్దాయికి చట్టపరమైన నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ బకాయి సొమ్ము చెల్లించకపోవడంతో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి బి. రవికుమార్ ముద్దాయి దొడ్ల వెంకటరామయ్యపై నేరం రుజువైనట్లు నిర్ధారించి, ఆరు నెలలు జైలు శిక్షతోపాటు ఫిర్యాదుదారుడికి రూ.9 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు కోసిక శ్యామ్ తరఫున కొత్తగూడెం సీనియర్ న్యాయవాది లక్కినేని సత్యనారాయణ వాదనలు వినిపించారు.

Also read: దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

Tags

Related News

ఇంత పనికిమాలిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశామా.. కాంగ్రెస్‌పై జగదీశ్‌రెడ్డి ఫైర్!

ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

వీడు మనిషా..మృగమా.. స్నేహితులతో కలిసి భార్యపై లైంగిక దాడులు!

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!

Big Stories

Advertisement
×