E-Paper
Advertisement

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!
Advertisement

Tanuja Ranjan: జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ IPS భార్య తనూజ రంజన్ మర్డర్ కేసు నిందితులు దొరికిపోయారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ వరకు.. కర్ణాటక నుంచి బిహార్ వరకు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వరకు గాలించారు. నేపాల్‌ బోర్డర్‌లోనూ మకాం వేశారు. చివరకు పనిమనిషితో సహా నేపాల్‌గ్యాంగ్‌ని పట్టుకున్నారు. అది మే 7అర్ధరాత్రి.. హైదరాబాద్ నగరమంతా ప్రశాంతంగా నిద్రపోతోంది. కానీ జూబ్లీహిల్స్‌లోని ఆ వీఐపీ బంగ్లాలో మాత్రం మృత్యువు సైలెంట్‌గా అడుగులేసింది. ఎవరూ తలుపు తట్టలేదు. తాళం విరగలేదు. ఇంట్లో నమ్మకంగా తిరిగిన పనిమనిషి కల్పనే గడియ తీసి.. దొంగలకు దారి ఇచ్చింది. ఆ పనిమనిషి పూణేకి చెందిన బికాస్‌ గాడితో చేతులు కలిపి.. నేపాల్ దొంగల ముఠాని ఇంట్లోకి దింపింది.

బార్‌లో పెగ్గులేసి..

పుణెలో కారు రెంట్‌కు తీసుకొని హైదరాబాద్‌లో దిగిన ఈ గ్యాంగ్.. MGBS దగ్గర బార్‌లో పెగ్గులేసి చోరీకి స్కెచ్ వేశారు. కొందరు బయట వాచ్ ఇంకొందరు లోపల అటాక్.. అమ్మలాంటి ఆమె మాటను గుడ్డముక్కల్లో కుక్కారు. తనూజ కళ్లలో భయాన్ని, గొంతులో ఆగిన కేకను ఆ గది గోడలు మాత్రమే విన్నాయి. మెరుపుల బంగారం కోసం అన్నం పెట్టిన అమ్మకే ఉరితాళ్లు బిగించి చంపేశారు. కోటి రూపాయల విలువైన 2వందల 25 గ్రాముల గోల్డ్‌తో జంప్ అయ్యారు.

Advertisement

Also read: DPDP చట్టంపై సుప్రీంలో విచారణ.. జర్నలిస్టుల గోప్యత, స్వేచ్ఛపై కేంద్రానికి నోటీసులు!

8 రాష్ట్రాల దారుల్లో..

మర్డర్ చేసి బోర్డర్ దాటితే దొరకమని ఆ నిందితులు నవ్వుకున్నారేమో కానీ చట్టం చెవిలో ఆ నవ్వు ఒక సవాలై మోగింది. పోలీసుల ట్రాకింగ్ మొదలైతే లెక్క ఎలా ఉంటుందో చూపించారు. 8 రాష్ట్రాల దారుల్లో తిరిగారు. అడవులు, కొండల నీడల్లో ఐదు నెలల టెంట్లు వేసి మరీ నిరీక్షించారు. ఆ కళ్లు నిద్రమరిచాయి. ఆ అడుగులు అలుపెరగలేదు. ఒక్క ఆధారం కోసం అహర్నిషలు శ్రమించాయి. చివరకు ఆపరేషన్ క్లైమాక్స్ ఎక్కడో తెలుసా? మన నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర.. అక్టోబర్ 26న కాలు పెట్టారో లేదో.. నలుగురిని అరెస్ట్ చేశారు. పని మనిషి కల్పనతో పాటు గణేష్ బీకే చంద్ర బహదూర్ తమంగ్.. గణేష్ బహదూర్ షాహి దొరికిపోయారు. వారి దగ్గరి నుంచి 51 వేల 130 రూపాయల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.

మిజార్ మేలోనే అరెస్ట్..

Advertisement

ప్రధాన నిందితుడు సునీల్ బహదూర్ ఔజీ, సొత్తు కొన్న దిలీప్ బహదూర్ మిజార్ మేలోనే అరెస్ట్ అయ్యారు. వారి నుంచి 26 గ్రాముల బంగారం రికవరీ అయింది. కానీ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. మిగతా బంగారం ఎక్కడ? పరారీలో ఉన్న మరో ఇద్దరు హంతకులు ఎక్కడ నక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదో?

Also Read: 23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

Tags

Related News

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!

ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!

23 ఏళ్ల యువకుడి ఖతర్నాక్ సైబర్ దందా.. చివరికి ఎలా దొరికాడంటే?

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో స్మాల్ చేంజెస్.. సీఎం రేవంత్ నిర్ణయం!

ఆలోచన లేకుండా అప్పులు చేసిన మేధావి కేసీఆర్: మహేష్ కుమార్ గౌడ్

ప్రేమ పేరుతో మోసం.. ఖమ్మంలో ప్రియుడి ఇంటి ముందు బాధితురాలి ధర్నా!

‘అర్నబ్’ తుపాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు!

Big Stories

Advertisement
×