E-Paper
Advertisement

నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నవంబర్ నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!
Advertisement

Congress Elections: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి, మళ్లీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సెక్రటేరియట్ లో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎదురవుతున్న అన్ని సమస్యలకు నవంబర్ లో పరిష్​కారం లభిస్తుందన్నారు.

కనీసం 40 శాతం సీట్లు..

ఆ తర్వాత నేరుగా ఎన్నికల దిశగా తమ ప్రణాళిక ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కనీసం 40 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి తమకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని, తమ మధ్య ఉన్నంత కోఆర్డినేషన్ దేశంలో ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ గ్రౌండ్‌లో చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నారన్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం తన దృష్టికి వచ్చాయన్నారు. పూర్తి స్థాయిలో పరిశీలిస్తానని చెప్పారు.

Advertisement

Also read: ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?

హరీష్​ రావుకు పిచ్చి..

మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్, హరీష్ రావులు భ్రమల్లో బతుకుతున్నారన్నారు. కేసీఆర్‌ను మేధావి అనుకుంటామని , కానీ ఎలాంటి ఆలోచన లేకుండా విపరీతంగా అప్పులు చేశారన్నారు. ఆయన తప్పుడు నిర్ణయాలే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందన్నారు. ఎన్ నినో ప్రభావంతో హరీష్​ రావుకు పిచ్చిపట్టిందన్నారు. ఈ కరవు పరిస్థితి ప్రపంచమంతా ఉన్నదన్నారు. ఇక ప్రజలకు మేలు చేయని కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిస్థితి కూడా భూస్థాపితమే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న 8 మంది ఎంపీలలో ఇద్దరు గెలిస్తే ఎక్కువేనని చెప్పారు.

పీసీసీ చీఫ్​ సవాల్..

Advertisement

ఇప్పుడున్న 8 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా మళ్లీ గెలవలేరని పీసీసీ చీఫ్​ సవాల్ విసిరారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్‌కే ఓటేస్తారన్నారు. 90 వేల ఉద్యోగాల భర్తీ, ఉచిత విద్యుత్ లబ్ధిదారులు పార్టీ వెంటే ఉన్నారన్నారు. ప్రభుత్వాలు వచ్చినా ..పోయినా పార్టీ ప్రమాణికం, పర్మినెంట్ అని పీసీసీ చీఫ్​ చెప్పారు. గ్రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే తమకు అసలైన శక్తి అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Also read: వీడు మనిషా..మృగమా.. స్నేహితులతో కలిసి భార్యపై లైంగిక దాడులు!

Tags

Related News

బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులో సంచలనం.. ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు!

ఆధార్ తరహాలో ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

దేశంలోనే మొట్టమొదటి ఆరవ తరం హైబ్రిడ్ సీడ్.. ఏ పంటకో తెలుసా..?

వీడు మనిషా..మృగమా.. స్నేహితులతో కలిసి భార్యపై లైంగిక దాడులు!

బౌరంపేటలో తీవ్ర విషాదం.. వీధి కుక్క దాడితో మహిళ మృతి!

జూబ్లీహిల్స్ రిటైర్డ్ ఐపీఎస్ భార్య మర్డర్ కేసు గుట్టురట్టు.. హంతకులు అరెస్ట్!

ఆర్టీసీ ఫ్రీ బస్సు నా కాపురం కూలుస్తోంది సాబ్.. ఎమ్మెల్యేతో ఓ వ్యక్తి ఆవేదన!

Big Stories

Advertisement
×