Daren Sammy On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ) మధ్య జరిగిన మూడో టీ20 సందర్భంగా అభిషేక్ షేక్ శర్మ సూపర్ సెంచరీ చేశారు. ఈ తరుణంలోనే 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విండీస్ టీమ్ హెడ్ కోచ్ డారెన్ సమీ (Daren Sammy) వివాదస్పద ట్వీట్ చేశారు. చిన్న బౌండరీలు, ఫ్లాట్ మైదానలతోనే టీమిండియా తరచూ గెలుస్తోందని బాంబ్ పేల్చారు. భారత దేశ వ్యాప్తంగా అలాంటి మైదానాలే ఉన్నాయని, అయినా తాము టీమిండియా ఓడించామని గుర్తు చేశారు. కానీ న్యూజిలాండ్ మాత్రం సొత్త గడ్డపై చిత్తుగా ఓడి, టీమిండియా చేతిలో సిరీస్ కోల్పోయిందని విమర్శలు చేశారు. ఈ లెక్కన భారత గడ్డపై టీ20 సిరీస్ ను 2-2 తేడాతో సమం చేసిన తమ విండీస్ జట్టే న్యూజిలాండ్ కంటే గ్రేట్ అనే అర్థం వచ్చేలా సెటైరికలు ట్వీట్ చేశారు.
భారత దేశంలో చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ లు ఉండటం వల్లే టీమిండియా భయంకరమైన జట్టుగా కనిపిస్తోందని విండీస్ టీమ్ హెడ్ కోచ్ డారెన్ సమీ (Daren Sammy) వివాదస్పద కామెంట్స్ చేశారు. ఫ్లాట్ మైదానాల వల్లే, ప్రతీ మ్యాచ్ గెలుస్తూ ముందుకు వెళుతోందన్నారు. అయినా, భారత పర్యటనలో తమ జట్టు 2-2 తేడాతో సిరీస్ సమం చేయడం గ్రేట్ అన్నారు. అందుకే తమ విండీస్ ప్లేయర్లను మెచ్చుకున్నట్టు గుర్తు చేశారు. న్యూజిలాండ్ లోనూ ఫ్లాట్ మైదానాలు, చిన్న బౌండరీలు ఉన్నాయని అందుకే అభిషేక్ శర్మ భయంకరమైన సెంచరీ చేసినట్టు బాంబ్ పేల్చారు. లేకపోయింటే డకౌట్ అయ్యేవాడని హేళన చేశారు.
విండీస్ టీమ్ హెడ్ కోచ్ డారెన్ సమీ చేసిన పోస్ట్ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. చిన్న బౌండరీలు, ఫ్లాట్ పిచ్ లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా కచ్చితంగా ఫోకస్ చేయాలని కోరుతున్నారు. బౌలింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ లు తయారు చేయాలని కోరుతున్నారు. అప్పుడే బౌలర్లు మెరుగ్గా రాణిస్తారని చెబుతున్నారు. లేకపోతే వాళ్ల బతుకు బస్టాండే అంటూ రియాక్ట్ అవుతున్నారు.
వెల్లింగ్టన్ వేదికగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లు ఆడింది. ఈ తరుణంలోనే 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అభిషేక్ శర్మ సెంచరీ చేశారు. దీంతో 13.2 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది ఇండియా. దీంతో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
Dareen Sammy on Cricket in India.
1. Smaller boundaries
2. Batting paradise pitches
3. Wet ball for bowlers pic.twitter.com/GVQ2hFfzxd— Talha Digital. (@CallMeDigital1_) October 27, 2026