Tanveer Ahmed On IND VS NZ : టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand vs India, 3rd T20I) మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. సిక్సర్లు, బౌండరీలతో మ్యాచ్ హోరెత్తించింది. అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే చేసిన సెంచరీ నేపథ్యంలో 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది. అయితే, ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియాలో మొనగాళ్లే ఉంటే, 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయ్యేదంటూ బాంబ్ పేల్చారు. నిజంగానే టీమిండియా బలంగా ఉంటే, పవర్ ప్లేలోని మొదటి 6 ఓవర్లలో 199 పరుగులు చేసి విక్టరీ సాధించేవాళ్లంటూ బాంబ్ పేల్చారు. ఐపీఎల్ లో ఇరగదీసే టీమిండియా క్రికెటర్లు 199 పరుగుల టార్గెట్ ను చేధించే క్రమంలో 13.2 వరకు సాగదీశారని సెటైర్లు పేల్చారు. దీంతో ఐపీఎల్ లో తప్ప, అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా ప్లేయర్లు రాణించలేరంటూ చురకలు అంటించారు. దీంతో టీమిండియాపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఐపీఎల్‌లో సిక్సులకు తప్ప, టీమిండియా ప్లేయర్లు దేనికి పనికిరారని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మూడో టీ20లో గెలిచిన టీమిండియాను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. భారత దేశంలో ఉన్న ఫ్లాట్ పిచ్ లపై ఆడటం అలవాటు చేసుకున్న టీమిండియా, విదేశాల్లో ఆడటం కష్టమేనన్నారు. న్యూజిలాండ్ లో బౌండరీలు చిన్నగా ఉన్న తరుణంలోనే అభిషేక్ శర్మ దుమ్ములేపాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మొదటి రెండు టీ20లలో అభిషేక్ శర్మ ఆడలేదని, వెల్లింగ్టన్ వేదికగా బౌండరీలు చిన్నగా, ఫ్లాట్ పిచ్ లు ఉండటంతో రెచ్చిపోయాడంటూ పరువు తీశారు. దీంతో మరోసారి అభిషేక్ శర్మ స్లాగర్ అని నిరూపితమైందని చురకలు అంటించారు. అతడు కళ్లు మూసుకుని మూడో టీ20లో బ్యాటింగ్ చేశాడని వెల్లడించారు. సెంచరీ కంటే ముందు చాలా లైఫ్ లు వచ్చాయని, న్యూజిలాండ్ సరిగ్గా క్యాచ్ లు పట్టింటే అభిషేక్ శర్మ సెంచరీ చేసేవాడు కాదంటూ బాంబ్ పేల్చారు.
న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 9 బౌండరీలు ఉన్నాయి. ఈ దెబ్బకు 13.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 198 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి, టీమిండియా గెలిచింది.