Kanchan Bagh: సభ్య సమాజం తల దించుకునే ఉదంతమిది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యను ఓ మృగాడు తన స్నేహితుల వాంఛలకు బలి చేశాడు. రోజులపాటు ఈ నరకాన్ని అనుభవించిన బాధితురాలు ఎట్టకేలకు ఇంటి యజమాని జోక్యంతో చెర నుంచి బయటపడింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన కాంచన్ బాగ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకని కోసం గాలిస్తున్నారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మయన్మార్ కు చెందిన మహ్మద్ ఫయాజ్ బంగ్లాదేశ్ మీదుగా మే నెలలో హైదరాబాద్ వచ్చాడు. వచ్చే సమయంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మయన్మార్ దేశానికే చెందిన 18ఏళ్ల యువతిని వెంట తీసుకొచ్చాడు. ఇక్కడకు వచ్చిన తరువాత ఓ ఖాజీ సమక్షంలో ఆమెను నిఖా (పెళ్లి) చేసుకున్నాడు. హాఫీజ్ బాబా నగర్ లోని క్యాంప్ నంబర్ 21లో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. ఆ తరువాత కొన్నిరోజులకు మయన్మార్ దేశానికే చెందిన తన స్నేహితులు నూర్ కమాల్, అహ్మద్ ముజీబ్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ ఇబ్రహీంను పిలిపించుకుని తన ఇంట్లోనే వసతి కల్పించాడు.
Also read: ఆర్. నారాయణమూర్తి మనసు మార్చిన హుషారు 2..ఎందుకు ఒప్పుకున్నారో ?
ఇక, ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్లినా మహ్మద్ ఫయాజ్ తాళం వేసుకుని వెళ్లేవాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే భార్య..స్నేహితులను ఇంట్లో ఉంచి అతను బయటకు వెళ్లటం. మహ్మద్ ఫయాజ్ అలా వెళ్లగానే నూర్ కమల్, అహ్మద్ ముజీబ్, జియా ఉర్ రెహ్మాన్ లు బాధితురాలి ఇష్టానికి విరుద్ధంగా పలుమార్లు లైంగిక దాడులు జరిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టిన నిందితులు ఆమెకు నరకం చూపించారు.
కాగా, ఈనెల 23న రాత్రి 11గంటల సమయంలో తనకు రావాల్సిన అద్దె డబ్బు కోసం ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళాలు వేసి ఉండటంతో వాటిని పగలగొట్టాడు. దాంతో బాధితురాలు చెర నుంచి బయటకు వచ్చింది. వెంటనే తన కుటుంబ సభ్యులను సంప్రదించి బాలాపూర్ రాయల్ కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈనెల 26న కాంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో నూర్ కమాల్, అహ్మద్ ముజీబ్, జియా ఉర్ రెహ్మాన్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహ్మద్ ఫయాజ్ కోసం గాలిస్తున్నారు. మహ్మద్ ఫయాజ్ పట్టుబడితే ఇంతటి దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్నది స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.
Also Read: నన్ను చూసిన ప్రతి మగాడు చెమటలు కక్కుతున్నారు.. శ్రీముఖి బోల్డ్ కామెంట్స్!