E-Paper
Advertisement

KTR: రెండు అయిపోయాయి.. ఇది మూడోది, అసెంబ్లీ సమావేశాల్లో అజెండా ఇదే, కేటీఆర్ క్లారిటీ

KTR: రెండు అయిపోయాయి.. ఇది మూడోది, అసెంబ్లీ సమావేశాల్లో అజెండా ఇదే, కేటీఆర్ క్లారిటీ

KTR: ఈసారి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తన అజెండాను బయటపెట్టింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దతపై దృష్టి సారిస్తామని తెలిపారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, రెండేళ్లు గడిచినా ఏమీ లేదన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో మా అజెండా ఇదే-బీఆర్ఎస్

సోమవారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు తొలిరోజు పూర్తి అయ్యింది. రెండో రోజు అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ అజెండాను బయటపెట్టింది బీఆర్ఎస్. గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి కేటీఆర్, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయాలను గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పిస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ, ఆ మాట మరిచారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఈ విషయాన్ని చెప్పిందన్నారు.

ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తాం, క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

అప్పటి గవర్నర్ సౌందర్యరాజన్ చెప్పారని, రెండున్నరేళ్లు గడిచిపోయిందన్నారు. ఇంతవరకు ఆరు గ్యారెంటీలకు ఎలాంటి చట్ట బద్దత లేదన్నారు. నాట్లు వేసే సమయంలో రైతు బంధు స్కీమ్ నిధులు పడేవని, ఇవాళ పంటలు కోతలకు వచ్చినా ఇప్పటివరకు నిధులు రైతుల ఖాతాలో పడలేదన్నారు.  అందుకే రాహుల్ బంధు కాదని, రైతు బంధు వేయాలన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పకనే చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలపై మోసం చేసిందన్నారు. బలహీన వర్గాలకు లక్ష కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారని, ఎక్కడంటూ సూటిగా ప్రశ్నించారు. రెండు బడ్జెట్ లు అయిపోయాయని, మరి మూడో బడ్జెట్‌లో నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎస్టీ, ఎస్సీలకు అంబేద్కర్ అభయ హస్తం ప్రకటిస్తామని చెప్పారని ఎక్కడంటూ నిలదీశారు.

ALSO READ: కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ టెస్టు చేయించుకుంటారా?

రెండు లక్షల ఉద్యోగాల మాటేంటి? ఆరు గ్యారెంటీలకు మంగళం పాడినట్టు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర వేలు కోసం మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. నాలుగు వేలు పెన్షన్లు ఎప్పుడంటూ పెద్దవారు ఆసక్తిగా ఉన్నారని, రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. 10 వేల కోట్లు ఫీజు రీయంబర్స్‌మెంటు బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదన్నారు.

దానివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడంటూ చూస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్ అని అన్నారని, క్యాలెండర్ ఉందని, కానీ ఉద్యోగాలు కనిపించలేదన్నారు. పై విషయాలపై కచ్చితంగా ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఆర్థిక అరాచకం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీస్తామని దుయ్యబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

 

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×