E-Paper
Advertisement

KTR: అది దాచడానికే ఈ డ్రామాలు.. అంతా దండుపాళ్యం బ్యాచ్: కేటీఆర్

KTR: అది దాచడానికే ఈ డ్రామాలు.. అంతా దండుపాళ్యం బ్యాచ్: కేటీఆర్
Advertisement

KTR: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బొగ్గు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు.

సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన భారీ కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కింగ్ పిన్ అని, ఆయనకు అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు.బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని, అందుకే ఆయన మౌనంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం నైనీ బ్లాక్ మాత్రమే కాకుండా, సృజన్ రెడ్డి దక్కించుకున్న అన్ని టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

బొగ్గు కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే రాత్రికి రాత్రే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. ఇది సిట్ విచారణ కాదని, రేవంత్ రెడ్డి పంపిస్తున్న ‘చిట్టి’ విచారణ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసులో పస లేదని కొట్టివేసినా, మళ్లీ విచారణ అనడం కేవలం రాజకీయ వేధింపులేనని మండిపడ్డారు. ఈ రాజకీయ క్రీడలో భాగస్వాములవుతున్న అధికారులను వదిలిపెట్టబోమని, రిటైర్ అయిన వారిని కూడా చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

కేబినెట్ మొత్తం ‘దండుపాళ్యం బ్యాచ్’లా తయారైందని, దందాల నుండి దృష్టి మళ్లించడానికే ఇలాంటి విచారణలు చేపడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ మంత్రి కొడుకు భూ అరాచకాలపై లేదా ఏఐసీసీ సెక్రటరీ డిమాండ్ చేసిన నిధులపై సిట్ విచారణ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదని, రేపు అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also:  రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×