E-Paper
Advertisement

Nalgonda District Farmers: రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు

Nalgonda District Farmers: రుణమాఫీ.. న్యాయం కావాలంటూ కోర్టుకెళ్లిన నల్గొండ జిల్లా రైతులు
Advertisement

Nalgonda District Farmers: తెలంగాణలో రైతు రుణమాఫీ అమలు తీరుపై నెలకొన్న వివాదాలు ఇప్పుడు న్యాయస్థానానికి చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 2 లక్షల రుణమాఫీ పథకంలో తమకు లబ్ధి చేకూరలేదని, ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల తాము నష్టపోతున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా, పరిపాలనాపరంగా చర్చనీయాంశమైంది.

అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 567 లోని కొన్ని మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన రైతులకు శాపంగా మారాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా జంగారెడ్డిపల్లికి చెందిన బద్దం నరసింహ రెడ్డి అనే రైతు, ప్రభుత్వం ప్రకటించిన గడువులోపు తాను అప్పు తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో తన పేరు జాబితాలో లేకపోవడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

నరసింహ రెడ్డితో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరికొంత మంది రైతులు కూడా ఇదే బాట పట్టారు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ వివరాల్లో తప్పులు, లేదా ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రుణాలు ఉండటం వంటి కారణాల చూపి అధికారులు తమను పథకానికి దూరం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో షరతులు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం మోసగించడమేనని రైతులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ జి. మాధవీదేవి ధర్మాసనం రైతు సమస్యను సీరియస్‌గా పరిగణించింది. అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు, సంబంధిత బ్యాంకు అధికారులకు నోటీసులు పంపింది. అసలు ఏ ప్రాతిపదికన రైతులను పథకం నుండి తొలగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Also Read: మెదక్ జిల్లాలో విషాదం.. మద్యానికి బానిసై కన్నతల్లిని పొట్టనబెట్టుకున్న కిరాతకుడు

ప్రభుత్వానికి ఈ న్యాయపోరాటం ఒక సవాలుగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రుణమాఫీ కాలేదని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తున్న తరుణంలో, హైకోర్టు జోక్యం చేసుకోవడం గమనార్హం. తదుపరి విచారణలో ప్రభుత్వం ఇచ్చే వివరణపైనే ఈ పథకంలో మార్పులు చేర్పులు ఉంటాయా లేక పిటిషనర్లకు మాత్రమే న్యాయం జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×