BigTV English

Telangana Govt: మొదలైన మూసీ ప్రక్షాళన.. నిర్వాసితులకు శుభవార్త, పిల్లలు నష్టపోకుండా..

Telangana Govt: మొదలైన మూసీ ప్రక్షాళన.. నిర్వాసితులకు శుభవార్త, పిల్లలు నష్టపోకుండా..

Telangana Govt: మూవీ ప్రక్షాళన కోసం శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. రెండుసార్లు సర్వే చేసిన అధికారులు, ఆక్రమణలు, నిర్వాసితులను గుర్తించింది. అర్హుల వివరాలపై ఆరా తీస్తోంది. నది గర్భంలోని నిర్మాణాలపై దృష్టి సారించిన అధికారులు.. రేపో మాపో బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మార్కింగ్ చేయనున్నారు. నిర్వాసితుల పిల్లలకు సైతం విద్యా సంవత్సరం నష్టపోకుండా 15 రోజుల్లో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.


రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కాపాడాలంటే మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడం ఒక్కటే ఆలోచనని భావిస్తోంది రేవంత్ సర్కార్. మూసీ పునరుద్దరణ లేకుంటే భవిష్యత్తు ముప్పు తప్పదంటూ పర్యావరణ వేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు అన్నివిధాలుగా వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది ప్రభుత్వం. నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేం దుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. అంగన్వాడీ నుంచి కాలేజీలకు వెళ్లే విద్యార్థుల వరకు వివరాలు సేకరిస్తోంది. శని, ఆదివారాల్లో ఆ పనిని పూర్తి చేయనుంది. నిర్వాసితుల ఇళ్లు సమీపంలో బాధిత పిల్లలు పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.


నిర్వాసితులకు ఉపాదిపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. పట్టా భూముల ఇళ్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటికే వనస్థలిపురం, జియాగూడ, నాంపల్లి వంటి ప్రాంతాల మూవీ నిర్వాసితుల కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించింది.

ALSO READ: భారీగా పెరిగిన ధరలు.. సామాన్యుల నడ్డి విరుస్తోన్న నిత్యావసర ధరలు!

బాధితులను తరలించే విషయంలో చిన్నపాటి గొడవలను అతిగా చిత్రీకరించేలా సోషల్‌మీడియాలో విష ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది. గతంలో మాదిరిగా ఏక పక్ష నిర్ణయాలు తీసుకోకుండా.. బాధితులను ఒప్పించి, మరో ప్రాంతానికి తరలిస్తోంది. ఇందుకోసం 25 టీములను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

 

 

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×