KTR Young Look : కల్వకుంట్ల తారక రామారావు. కేటీఆర్ గా ఫుల్ పాపులర్. తెలంగాణ మంత్రి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాజకీయ వ్యవహారాల్లో నిత్యం బిజీగా ఉండే కేటీఆర్.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. ట్విటర్ లో రెగ్యులర్ గా టచ్ లోకి వస్తారు. మునుగోడు విజయం తర్వాత సోమవారం కాస్త రిలాక్స్ అయినట్టున్నారు కేటీఆర్. సోషల్ మీడియాలో పలు ఆసక్తికర పోస్టులు పెట్టారు. ట్విటర్ లో ఆయన పోస్ట్ చేసిన ఓ పాత ఫోటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు యూజర్స్.
20 ఏళ్ల క్రితం నాటి తన ఫోటోను షేర్ చేశారు కేటీఆర్. ఆ ఫోటోలో కేటీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఆ పక్కనే లేటెస్ట్ ఫోటో కూడా పెట్టారు. త్రో బ్యాక్.. అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. 20 ఏళ్ల నాటి కేటీఆర్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు
‘మీరు ఎవర్ గ్రీన్’.. ‘అప్పట్లో రామ్, ఇప్పుడు రామన్న’.. ‘మీరు మారలేదు సార్’.. ఇలా రకరకాల రిప్లైలతో కేటీఆర్ యంగ్ లుక్స్ ను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్స్.