BigTV English

KTR: రాత్రంతా నిద్ర లేదా? టెన్షన్‌లో కేటీఆర్.. తీర్పు రివర్సయితే సుప్రీంకోర్టుకి?

KTR: రాత్రంతా నిద్ర లేదా? టెన్షన్‌లో కేటీఆర్.. తీర్పు రివర్సయితే సుప్రీంకోర్టుకి?

KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసులో సోమవారమంతా హైడ్రామా చోటు చేసుకుందా? కేటీఆర్‌కు రాత్రంతా నిద్ర పట్ట లేదా? ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన వ్యవహారమే పదేపదే గుర్తుకు వచ్చిందా? మీడియా ముందు ఏ విచారణకైనా సిద్ధమేనన్న తారక రామారావు, సడన్‌గా వాయిస్ ఎందుకు మారింది? కావాలనే జాప్యం చేస్తున్నారా? సోమవారం జరిగిన పరిణామాలతో క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేస్తే.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఎంత ఎత్తుకు ఎదిగినా అణిగి మణిగి ఉండాలని పెద్దలు తరచు చెబుతారు. అదే సమయంలో నోరు కూడా అదుపులో పెట్టుకుంటే ఇంకాస్త మంచిదంటారు. మాటల వల్లే యుద్ధానికి దారి తీసిన ఘటనలు పురాణాల్లో చాలానే ఉన్నాయి. ఫార్ములా ఈ కారు రేసుపై కేసు నమోదు చేయగానే ఉలిక్కిపడ్డారు కేటీఆర్.

పలుమార్లు మీడియా ముందుకొచ్చిన కేటీఆర్, తన నోటికి పని చెప్పారు. ‘కుంభకోణం లేదు.. లంభకోణం లేదు.. లొట్టపీసు కేసని, జైలుకి వెళ్తే హాయిగా పుస్తకాలు చదువు కుంటానని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తానని’ పదేపదే చెప్పుకొచ్చారు. అవన్నీ మీడియా ముందు చెప్పేందుకు మాత్రమేనని తేలిపోయింది.


విచారణకు వరకు వచ్చేసరికి కొత్తగా మెలిక పెట్టారు కేటీఆర్. లాయర్ ఉంటేనే విచారణకు వస్తానని, లేకుంటే రానని మొండికేశారు. ఫార్ములా కేసులో సోమవారం జరిగిన పరిణామాలను తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించారు. కచ్చితంగా స్కామ్ జరిగిందనే అంచనాకు వస్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారీ తాను నిప్పు అని పదేపదే మాటలు వల్లె వేస్తున్నారు కూడా.

ALSO READ: ఘట్‌కేసర్ కారు ఘటనలో బిగ్ ట్విస్ట్.. వాళ్లిద్దరూ..?

షెడ్యూల్ ప్రకారం.. ఇదే కేసులో మంగళవారం ఈడీ ముందుకు విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సివుంది. ప్రస్తుతం తాను విచారణకు రాలేనని చెప్పారు. ఎందుకుంటే విచారణ సమయంలో ఈడీ అరెస్టు చేస్తే బెయిల్ రావడం కష్టమనే భయంతో డుమ్మా కొట్టారన్నది అధికార పార్టీ నేతల మాట.

ఏసీబీ తనపై నమోదు చేసిన కేసు రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించానని ఈడీకి తెలిపారు కేటీఆర్. ప్రస్తుతం తీర్పు రిజర్వులో ఉందన్నారు. తీర్పు వచ్చేవరకు తనకు కొంత సమయంలో కావాలంటూ ఈ-మెయిల్‌లో ప్రస్తావించారు.

మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం తీర్పు వెలువరించ నుంది. న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ తీర్పు వెల్లడించనున్నారు. దీంతో తీర్పు ఎలా ఉంటుంది? క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేస్తే తదుపరి పరిణామాలేంటి? అప్పుడు కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనా? దాని నుంచి తప్పించుకోవడం ఎలా? ఇవే ఆలోచనలు రాత్రంతా ఆయనను వెంటాడినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఎన్నికల బాండ్లు పేరిట పార్టీలకు గ్రీన్ కో నిధులు ఇవ్వడంపై ఈడీ ఫోకస్ చేసింది. సోమవారం ప్రభుత్వం బయట పెట్టిన వివరాలు సైతం మరోసారి పరిశీలన చేసినట్టు తెలుస్తోందట. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు నుంచి దాదాపు 41 సార్లు బీఆర్ఎస్‌కు ఎన్నికల బాండ్ల రూపంలో నిధులిచ్చినట్టు రిపోర్టు బయటకు వచ్చింది.

ఫార్ములా ఈ ఆపరేషన్స్(ఎఫ్ఈవో), ఎస్ నెక్ట్స్ జెన్ సంస్థల ఆర్థిక లావాదేవీలపై ఈడీ కూపీ లాగుతోంది. వీటిపై ఫెమా చట్టం కింద మరో కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏసీబీ నుంచి కీలక సమాచారాన్ని ఈడీ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×