Venkatesh: తెలుగులో ఒకవైపు యూత్‌ను, మరొకవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు వెంకటేశ్. హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి పెద్దగా కాంట్రవర్సీలు లేకుండా ఫ్యామిలీ హీరోగా అందరికీ దగ్గరయ్యారు వెంకటేశ్ (Venkatesh). ఫ్యాన్స్ దృష్టిలో వెంకీ మామ అయిపోయారు. మాస్, కమర్షియల్ సినిమాలు చేసినా కూడా ఆయనను అందరికీ దగ్గర చేసింది మాత్రం ఫ్యామిలీ కథలే. ఇప్పుడు అలాంటి మరొక ఫ్యామిలీ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు వెంకీ మామ. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇందులో వెంకటేశ్ చేసిన పనికి అందరూ షాకయ్యారు.
ఊహించని హగ్
విక్టరీ వెంకటేశ్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. ఆయన కూల్ యాటిట్యూడ్‌కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయనలాగా ఉండాలంటూ ఫీలవుతుంటారు. అలా తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చాలామంది వెంకటేశ్ లేడీ ఫ్యాన్స్ వచ్చారు. అందులో కొందరితో హోస్ట్ శ్రీముఖి ఇంటరాక్ట్ అయ్యింది. ఒకవేళ వెంకటేశ్‌కు ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తారు అని అడిగింది. ‘సార్ ఒప్పుకోరు. లేకపోతే నేను ఎప్పుడో చెప్పేదాన్ని’ అని ఆ ఫ్యాన్ సమాధానమిచ్చారు. ఆ సమాధానం వెంకీ మామకు నచ్చిందనుకుంటే వెంటనే వెళ్లి ఆమెను హగ్ చేసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు.
Also Read: ‘సంక్రాంతికి వస్తున్నాం’పై మహేశ్ బాబు మొదటి రివ్యూ.. ఇది మాత్రం మిస్ అవ్వరుగా.!
చూసి నేర్చుకోండి
మామూలుగా వెంకటేశ్‌కు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టమే. కానీ ఒక ఫ్యాన్ ప్రపోజ్ చేయగానే వెంటనే ఆమెను వెళ్లి హగ్ చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌తో ఎలా ఉండాలో వెంకీ మామను చూసి నేర్చుకోవాలి అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో త్వరలోనే ప్రేక్షకులను అలరించనున్నారు వెంకటేశ్. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లోని హ్యాట్రిక్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా సూపర్ హిట్ అవుతుందని అందరూ నమ్మకంతో ఉన్నారు.
పక్కా హిట్
జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) విడుదలకు సిద్ధమయ్యింది. అందులో వెంకటేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పోస్టర్స్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా తాజాగా విడుదలయిన ట్రైలర్ కూడా ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ సినిమాలతో అందరికీ దగ్గరయిన వెంకటేశ్.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కామెడీని తెరకెక్కించే అనిల్ రావిపూడి కలిస్తే.. హిట్ పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ సంక్రాంతికి మరెన్నో సినిమాలు విడుదలవుతున్నా కూడా తమ కంటెంట్‌ను నమ్మి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా బరిలోకి దిగనుంది.
Eewwwww Venky Mawa ❤❤🥹🥹😁😁😁#venkatesh #SankranthikiVasthunam pic.twitter.com/nd7MSvrvZL
— Addicted To Memes (@Addictedtomemez) January 6, 2025