BigTV English

Lady Aghori: సొంత గ్రామానికి అఘోరీ, ఈసారి టార్గెట్..

Lady Aghori: సొంత గ్రామానికి అఘోరీ, ఈసారి టార్గెట్..

Lady Aghori: మహిళా అఘోరీ టార్గెట్ ఏంటి? కార్తీక మాసం నేపథ్యంలో సొంతూరు లో మకాం వేసేందుకు ప్లాన్ చేసిందా? ఆమెకు తెర వెనుక కొందరు సహకరిస్తున్నారా? మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైందా? ఈసారి ఎలాంటి అలజడి రేపనుంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


మంచిర్యాల జిల్లా కుశ్నపల్లి‌ ప్రాంతం మహిళా అఘోరీ సొంతూరు. రెండురోజుల కిందట నానాయాతన పడి మహరాష్ట్రలోని లక్కడీకోటలో ఆమెని వదిలిపెట్టారు పోలీసులు. ఇక అఘోరీ రావడం కష్టమేనని అందరూ భావించారు.

అసలే కార్తీకమాసం.. ఇలాంటి సమయాన్ని అఘోరీ వదులుకుంటుందా? మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టేందుకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో స్వగ్రామంలో అప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది.


కార్తీక పౌర్ణమి తర్వాత కుశ్నపల్లిలో‌ అడుగు పెట్టనుంది అఘోరీ. ఈ క్రమంలో సొంత గ్రామంలో మళ్లీ ‌ఆత్మార్పణానికి సిద్దమవుతుందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అదంతా ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు.

ALSO READ: ఒవైసీ దెబ్బకు బీఆర్ఎస్ క్లోజ్?

స్వగ్రామంలో‌ శివాలయం నిర్మాణం‌ పనులు ప్రారంభించనుంది అఘోరీ. ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే.. కుశ్నపల్లి ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉన్న శివాలయం ఉండేది. దానికి అఘోరీ ‌నాన్నమ్మ పూజలు చేసిందని అంటున్నారు.

నాన్నమ్మ తన మనుమరాలైన అఘోరీని అవహించిందని అంటున్నారు.. బలంగా నమ్ముతున్నారు కుటుంబ సభ్యులు. ఆ శివాలయం నిర్మాణం చేస్తామని అఘోరీ చెబుతున్న మాట. గతంలో ఆలయం నిర్మాణం పూర్తి చేస్తామని గ్రామస్తులకు అఘోరీ హామీ ఇచ్చిందట. ఈ క్రమంలో మళ్లీ అక్కడికి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

అఘోరీలు ప్రజలకు దూరంగా ఉంటారు. ఎక్కువగా హిమాలయ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారని కొందరు చెబుతున్నమాట. సింపుల్ చెప్పాలంటే అస్సలు కంటికి కనిపించరు. సంక్రాంతి వేళ మహా కుంభ మేళాకు మాత్రమే వచ్చి గంగానది స్నానం చేసి వెళ్లిపోతుంటారు. కానీ, కనిపిస్తున్న మహిళా అఘోరీపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆమె వెనుక కొందరు ఉన్నారని అంటున్నారు. వారి సహకారంలో మళ్లీ కుశ్నపల్లికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెని ఊరిలోకి రాకుండా అడ్డుకోవాలనే ఆలోచన చేస్తున్నారట.

మహిళా అఘోరీ తొలుత సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటన చేసింది. ఆ తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో వార్తల్లోకి వచ్చేసింది. అఘోరీ కదలికలను పోలీసులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×