 
					Hyderabad News: మొంథా తుపాను తెలంగాణపై కన్నెర్ర జేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. చాలా వరకు రోడ్లు సైతం డ్యామేజ్ అయ్యాయి. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో ఓ గుట్టపై నుంచి భారీ బండరాయి రోడ్డుపైకి దూసుకొచ్చింది. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి హైడ్రా వాటిని తొలగించింది. ఇంతకీ ఎక్కడ?
హైదరాబాద్‌లో విరిగిపడిన కొండచరియలు
మల్కాజిగిరి ప్రాంతంలోని గౌతమ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. మొంథా తుపాను నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షానికి బండ రాయి కింద మట్టి కరిగిపోయింది. చివరకు భారీ బండరాయి జారిపడింది. ఎత్తైన ప్రాంతం నుంచి బండరాయి కిందకు రావడంతో కిందనే పార్కు చేసిన జీహెచ్ఎంసీ చెత్త తరలించే ట్రాలీ నుజ్జునుజ్జు అయ్యింది.
గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుట్ట పైనుంచి పెద్ద బండరాయి కిందకు జారి పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హైడ్రా-డీఆర్ఎఫ్-జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించారు. ఇప్పుడేకాదు గతంలో కూడా ఆ తరహా ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
రోడ్డుపైకి దూసుకొచ్చిన భారీ బండరాయి
నాలుగు నెలల కిందట కురిసిన వర్షాల సమయంలో గుట్టు పైనుంచి బండ రాళ్ళు కిందకు పడ్డాయి. చెత్త సేకరించినవారు ఈ గుట్టపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటోంది. అయితే ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన హైడ్రా, వారిని జూలైలో ఖాళీ చేయించింది.
ALSO READ: గురుకుల-కేజీబీవీ విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ బకాయిలు క్లియర్
ప్రస్తుతం ఆ గుట్టపై ఎవరూ లేరని చెబుతున్నారు. లేకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రతి శనివారం ఆ ప్రాంతంలో భారీగా సంత కూడా జరుగుతుంది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.