 
					Uttam Kumar Reddy: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం.. బీజేపీ ద్వంద్వ వైఖరీకీ నిదర్శనం అని కాంగ్రెస్ విమర్శించింది.
రాజస్థాన్ లో కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మరణంతో.. (జనవరి 5,2024)న ఉపఎన్నిక జరిగింది.
ఆ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన సురేంద్ర పాల్ సింగ్‌కు.. సరిగ్గా ఆరు రోజుల ముందు డిసెంబర్ 30, 2023న ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిందని కాంగ్రెస్ గుర్తు చేసింది. రాజస్థాన్‌లో ఒప్పు.. తెలంగాణలో తప్పా అని బీజేపీ నేతలను ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే.. అజారుద్దీన్‌ను మంత్రి వర్గంలోనకి తీసుకోవలన్న కాంగ్రెస్ నేతలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ ఆపాలని నిన్న ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల ఓట్ల కోసమే అజారుద్ధీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఖండించారు. కుట్రలతో మైనార్టీకి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
క్యాబినేట్ విస్తరణ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే అజారుద్ధీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించింది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ ఆపాలంటూ తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు బీజేపీ నేతలు..
Also Read: ఐక్యతా విగ్రహం వద్ద నివాళులర్పించిన ప్రధానీ మోదీ
కాగా ఈరోజు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల15 నిమిషాలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు అజారుద్ధీన్. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన లేఖలు మంత్రులకు అందాయి.