 
					ASUS Mini PC| ఏసస్ కంపెనీ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన మినీ పీసీని లాంచ్ చేసింది. దీని పేరు ROG GR70 మినీ గేమింగ్ పీసీ. ఈ పీసీ ఏసస్ కంపెనీకి ఒక మైలురాయి. తొలిసారిగా AMD ప్రాసెసర్‌తో వచ్చిన ఈ పీసీ చాలా చిన్నది. సైజులో బుల్లిగా ఉన్నా.. అద్భుతమైన పనితీరు ఇస్తుంది. దీని సైజు కెపాసిటీ కేవలం 3 లీటర్లు మాత్రమే. సీరియస్ గేమర్లు, ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్లకు డెస్క్‌టాప్ లెవెల్ పవర్ ఇస్తుంది. దీన్ని డెస్క్ టాప్ పై పెడితే పెద్ద టవర్ అనే ఫీలింగ్ ఉండదు.
AMD Ryzen 9 9955HX3D ప్రాసెసర్ ఈ సిస్టమ్‌ను నడిపిస్తుంది. Ryzen 9 9955X3Dలో అడ్వాన్స్‌డ్ 3D V-Cache టెక్నాలజీ ఉంది. గేమింగ్ సమయంలో డేటా యాక్సెస్ స్పీడ్ వేగంగా పెరుగుతుంది. Nvidia GeForce RTX 5070 GPU ఉంది. ఇది భారీ వర్క్‌లోడ్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. అడ్వాన్స్‌డ్ రెండరింగ్, గేమ్ స్ట్రీమింగ్ చేసినా సూపర్ పర్‌ఫామెన్స్ ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఇది ఒక పవర్‌ఫుల్ పీసీ.
ROG GR70 సైజు చాలా చిన్నది – 280 x 180 x 60 mm మాత్రమే. డిజైన్ క్లీన్, మోడరన్ స్టైల్‌లో ఉంటుంది. ముందు ప్యానెల్‌లో పోర్టులు సులభంగా అందుబాటులో ఉంటాయి. వెనుక ప్యానెల్ ఫ్యూచర్-ప్రూఫ్. రెండు డిస్‌ప్లే పోర్ట్ 2.1, రెండు HDMI 2.1 పోర్టులు, ఒక థండర్‌బోల్ట్ 4 పోర్టు, ఆరు USB 3.2 కనెక్షన్లు ఉన్నాయి. Wi-Fi 7 ని కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ పీసీలో మెమరీ అప్‌గ్రేడ్ సులభం. రెండు SODIMM స్లాట్లు DDR5 మెమరీకి ఉన్నాయి. స్టోరేజ్ కోసం రెండు M.2 2280 స్లాట్లు ఉన్నాయి. ఒకటి PCIe 5.0 SSDలకు సపోర్ట్ ఇస్తుంది. మరొకటి PCIe 4.0కి అనుకూలం. డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా చాలా వేగంగా జరుగుతుంది.
ఏసస్ ముందుగా చైనాలో ఈ మినీ గేమింగ్ పీసీని లాంచ్ చేసింది. ప్రారంభ ధర 14,999 చైనీస్ యువాన్. దీని ధర భారత్‌లో సుమారు రూ. 1.87 లక్షలు. ఇతర దేశాల్లో లాంచ్ ప్లాన్ గురించి ఇంకా ఏసస్ ప్రకటించలేదు. ఇండియాలో ధర కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇది ఖరీదైన ప్రొడక్ట్. కానీ పవర్‌ఫుల్, తక్కువ బరువు, తేలికైన డివైస్ కావాల్సినవారికి పర్ఫెక్ట్.
ఈ మినీ పీసీ చిన్న సైజులోనే డెస్క్‌టాప్ పవర్ ఇస్తుంది. గేమర్లు, క్రియేటర్లకు గొప్ప ఆప్షన్.
Also Read: జేబులో సరిపోయే ఫొటో ప్రింటర్.. షావోమీ కొత్త గాడ్జెట్ గురించి తెలుసా