E-Paper
Advertisement

Liquor Ban: సీక్రెట్‌గా సమాచారం ఇస్తే.. రూ. 2 వేలు మీవే.. లక్ష్మాజీపల్లి బంపర్ ఆఫర్

Liquor Ban: సీక్రెట్‌గా సమాచారం ఇస్తే.. రూ. 2 వేలు మీవే.. లక్ష్మాజీపల్లి బంపర్ ఆఫర్
Advertisement

Liquor Ban: యువతను వ్యసనాల బారి నుంచి కాపాడి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మాజీపల్లి గ్రామస్తులు ఏకగ్రీవంగా సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బెల్ట్ షాపుల సంస్కృతి వల్ల యువత పెడదారి పడుతుండటాన్ని గమనించిన గ్రామ పెద్దలు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు.

సుమారు 1300 జనాభా కలిగిన ఈ గ్రామంలో ఇటీవల సర్పంచ్‌గా ఎన్నికైన ముష్కే రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఈ మేరకు తీర్మానం చేశారు. మద్యం మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, గొడవలతో ఊరి వాతావరణం దెబ్బతింటోందని మహిళా సంఘాలు మరియు కుల సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ నిషేధాన్ని ఏదో మాటవరసకు కాకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ కమిటీ కఠినమైన నిబంధనలను రూపొందించింది. గ్రామంలో ఎవరైనా రహస్యంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడితే వారికి రూ. 10,000 భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే, మద్యం అమ్మేవారి గురించి లేదా తాగేవారి గురించి సమాచారం అందించిన వారికి రూ. 2,000 నగదు బహుమతి (Reward) అందజేస్తామని ప్రకటించారు.

ఇలా సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని గ్రామ పెద్దలు హామీ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు కచ్చితంగా అమలులోకి వస్తాయని గ్రామసభలో ప్రకటించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం, ఊరి బాగు కోసం లక్ష్మాజీపల్లి గ్రామస్తులు తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పొరుగు గ్రామాల ప్రజలు సైతం వీరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు.

Advertisement

Read Also:  ఇది కదా కావాల్సింది.. అక్రమ కబ్జాలపై హైడ్రా మెరుపు దాడి.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×