BigTV English

Telangana Political Heat: వేడెక్కిన స్థానిక సమరం.. దానిపై కారు-కమలం మల్లగుల్లాలు

Telangana Political Heat: వేడెక్కిన స్థానిక సమరం.. దానిపై కారు-కమలం మల్లగుల్లాలు

Telangana Political Heat: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందా? రేవంత్ సర్కార్ నిర్ణయంతో విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయా? సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో ఎలా చెయ్యాలనే ఆలోచనలో మిగతా పార్టీలు పడ్డాయా? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా అన్న ప్రశ్న బీఆర్ఎస్, బీజేపీలను వెంటాడుతోందా? తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పైకి చెబుతోందా? దీనిపై ఇంకా నిర్ణయం వెల్లడించకుండా బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తోంది?


రేపో మాపో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకానుంది. దీనికి సంబంధించి ఒకొక్కటి క్లియర్ చేస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బీసీ డెడకేటెడ్ కమిషన్ రిపోర్టుపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. దీని తర్వాత సర్పంచ్, ఎంపీటీపీ, జెడ్పీటీసీలు ఎన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం ఓ అంచనాకు రానుంది.

ఇక రాజకీయాల విషయానికొద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కులగణన సర్వే అసెంబ్లీ చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ పరంగా ఎన్నికల్లో 42 శాతం అమలు చేస్తామని కుండబద్దలు కొట్టేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా వస్తాయి. మిగతా 20శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలనే నిర్ణయానికి ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార పార్టీల్లో చర్చ జరుగుతోంది.


అధికార పార్టీ ఈ విధంగా చేస్తే.. మిగతా పార్టీలు కాంగ్రెస్ దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డెడికేటెడ్ సిపార్సుల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లకు 22 శాతం రిజర్వేషన్లు అధికారంగా అమలు చేస్తూనే మిగతా 20శాతం బీసీలకు టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఎంపీపీలు, జెడ్పీ ఛైర్మన్ ఎంపికలో దామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాల మాట.

ALSO READ: పార్టీలో పదవుల పండగ.. వర్కింగ్ ప్రెసిడెంట్‌పై నేతల కన్ను

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 శాతం కేటాయిస్తే.. మిగతా పార్టీలపై ఒత్తిడి పెరగడం ఖాయం. దీనిపై ఇటు బీఆర్ఎస్, బీజేపీలో తేల్చుకోలేక పోతున్నాయి. ఇటీవల ఆయా పార్టీ సమావేశాల్లో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీతోపాటు బీఆర్ఎస్ కూడా దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై గతంలో కేటీఆర్ ఓ మాట ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాము కూడా 42 శాతం కేటాయిస్తామని చెప్పేశారు. కానీ.. పార్టీలో పరిస్థితులు ఆ స్థాయిలో లేవని అంటున్నారు. అధికారం పోయిన తర్వాత కేడర్ చెల్లాచెదురైంది. కేడర్ బలహీనం కావడంతో క్షేత్రస్థాయిలోకి వెళ్ల లేని పరిస్థితి కారు పార్టీ నేతలది.

ఇక బీజేపీ విషయానికొద్దాం.బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సైలెంట్ అయిపోయింది. సిటీ, పట్టణాల్లో ఆ పార్టీ కొంత కేడర్ ఉంది. రూరల్లో మరింత వీక్‌గా కనిపిస్తోంది. ఇటీవల భర్తీ చేసిన పార్టీ మండల అధ్యక్ష పదవులు బీసీలకు 50 శాతం కేటాయించామని బయటకు చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియని సందిగ్ధంలో ఆ పార్టీ పడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో 42 శాతం అమలు చేస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే నినాదం రావచ్చని అంటున్నారు. మరి బీసీలకు 42 శాతం అంశం బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×