Big Stories

Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ.. ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందంటే..?

Lok Sabha Elections 2024: ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడీ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన విషయం కూడా తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కూడా పోలింగ్ జరగనున్నది. శనివారంతో నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యింది. అయితే, ఈసారి తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపింది.

- Advertisement -

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. కొంతమంది పార్టీల తరఫునా పోటీ చేశారు. ఇంకొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అయితే, ఈసారి మాత్రం తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్ సభ స్థానాల నుంచి తమిళనాడులోని విడుతలై చిరుతైగల్ కట్చి(వీసీకే) పార్టీ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. సికింద్రాబాద్ నుంచి శ్యామ్, హైదరాబాద్ నుంచి పద్మజ పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడిగా తిరుమావల్ ఉన్నారు. ఇంకో విషయమేమంటే.. తమిళనాడులోని డీఎంకే పార్టీతో వీసీకే పార్టీ పొత్తులో ఉంది.

- Advertisement -

Also Read: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై BJP సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

పొత్తులో భాగంగా తమిళనాడులో రెండు స్థానాలను డీఎంకే పార్టీ అగ్రనేతలు వీసీకే పార్టీకి కేటాయించారు. దీంతో వీసీకే పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దళితులు, బహుజనుల కోసం ఈ పార్టీ తమిళనాడులో గత 4 దశాబ్దాలుగా పోరాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వీసీకే పార్టీకి రాష్ట్రంలో గుర్తింపు ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News