Big Stories

RR vs LSG IPL 2024 Highlights: రాజస్థాన్..‘రాయల్’ విజయం.. పోరాడి ఓడిన లక్నో

Rajasthan Royals vs Lucknow Super Giants IPL 2024 Highlights: మొత్తానికి ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అప్రతిహిత విజయ పరంపర కొనసాగుతోంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో కూడా విజయం సాధించి తన హవా సాగించింది. టేబుల్ టాప్ లోనే కొనసాగుతోంది.

- Advertisement -

టాస్ గెలిచిన రాజస్థాన్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలోనే 199 పరుగులు చేసి విజయం సాధించింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (24), జాస్ బట్లర్ (34) ఇద్దరూ ఒక మాదిరిగా ఆడి అవుట్ అయ్యారు. దీంతో కెప్టెన్ సంజూ శాంసన్ వచ్చాడు. తను మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు. మామూలుగా కాదు.. 33 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

రియాన్ పరాగ్ (14) త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ ఈసారి క్లిక్ అయ్యాడు. 34 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాదు, రాజస్థాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇలా 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి రాజస్థాన్ విజయ యాత్ర కొనసాగించింది.

లక్నో బౌలింగులో యశ్ ఠాకూర్ 1, మార్కస్ స్టోనిస్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ పడగొట్టారు.

Also Read: ముంబై మళ్లీ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో కి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (8) త్వరగా అయిపోయాడు. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన మార్కస్ స్టోన్స్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 2 వికెట్లు పడిపోయి గిలగిల్లాడింది. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్లు కాపాడుకుంటూ రన్ రేట్ తగ్గిపోకుండా జాగ్రత్తగా ఆడి, జట్టుని మళ్లీ పట్టాలెక్కించాడు.

ఈ క్రమంలో 48 బంతుల్లో 2 సిక్స్ లు, 8 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత దీపక్ హుడా వచ్చాడు. రన్ రేట్ ఏ మాత్రం తగ్గకుండా 31 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో నికోలస్ పూరన్ (11) తక్కువకే అవుట్ అయ్యాడు. తర్వాత ఆయుష్ బదాని (18), కృనాల్ పాండ్యా (18) నాటౌట్ గా నిలిచారు.

ఒక దశలో 12.1 ఓవర్ లో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులతో పటిష్టంగా ఉన్న లక్నో 220 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. కానీ సడన్ గా సినిమా మారిపోయింది. సిక్సులు, ఫోర్లు కొట్టాల్సిన చోట సింగిల్స్ తీసుకుంటూ ఆడేసరికి స్కోరు పడిపోయింది. దీంతో 20 ఓవర్లు గడిచేసరికి 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల వద్ద బండి ఆగిపోయింది. మరో 20 పరుగులు చేసి ఉంటే రాజస్థాన్ కి గెలుపు కష్టమయ్యేదని అంటున్నారు.

ఎందుకంటే ఆఖరి 8 ఓవర్లలో లక్నో 70 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఓవర్ కి యావరేజ్ న 9 పరుగులున్నాయి. పర్వాలేదుకానీ, అవకాశం ఉంది, వికెట్లు ఉన్నాయి.దూకుడు పెంచితే బాగుండేదని అంటున్నారు. మొత్తానికి 5 వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.

రాజస్థాన్ బౌలింగులో ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 2, ఆవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News