BigTV English
Advertisement

DC vs MI: ముంబై మళ్లీ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

DC vs MI: ముంబై మళ్లీ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం..

DC vs MI: ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఓడలు బళ్లు అవుతున్నాయి. బళ్లు ఓడలవుతున్నాయి. మొన్నటి వరకు అట్టడుగు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో 5 వస్థానంలోకి చేరుకుంది. లయ అందుకున్నట్టే అందుకుని మళ్లీ ఓటమి బాటలో ముంబై పరుగులు పెడుతోంది.


ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగుకి వచ్చిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

వివరాల్లోకి వెళితే 258 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై కి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. టీమ్ ఇండియా కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో సగం మ్యాచ్ ఓడిపోయిందని అంతా ఫిక్స్ అయ్యారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.


4.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 45 పరుగులతో ముంబై ఈదుతూ కనిపించింది. ఆ సమయంలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వచ్చి ఒక ఆటాడుకున్నాడు. ఒక దశలో ఢిల్లీని వణికించాడు. కానీ 19 ఓవర్ లో మొదటి బంతికి దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయి వెనుతిరిగాడు. అదే మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మొత్తానికి తను 32 బాల్స్ లో 4 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేసి ముంబైకి ఊపిరి పోశాడు.

ఎట్టకేలకు హార్దిక్ పాండ్యా ఫామ్ లోకి వచ్చాడు. 24 బంతుల్లో 3 సిక్సులు, 4 ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత నెహాల్ వధేరా (4) త్వరగా అవుట్ అయ్యాడు. ఇక టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులు చేసి కాసేపు ఆశలు రేపాడు.

ముంబై టార్గెట్ కి దగ్గరగానే వచ్చింది కానీ, క్రమం తప్పకుండా వికెట్లు పడిపోవడంతో ఆ జట్టుకి మైనస్ గా మారింది. 12.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగుల మీదున్న ముంబై 210 వరకు బాగానే ఆడింది. ఇంక అక్కడ నుంచి వికెట్లు టపాటపా పడ్డాయి. మహ్మద్ నబీ (7), పీయూష్ చావ్లా (10) త్వరగా అవుట్ అయ్యారు. ల్యూక్ వుడ్ 9 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 20 ఓవర్లలో 247 పరుగుల వద్ద ముంబై కథ ముగిసిపోయింది. విజయానికి 10 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఢిల్లీ బౌలింగులో ముఖేష్ కుమార్ 3, రసిఖ్ సలమ్ 3, ఖలీల్ అహ్మద్ 2, వికెట్లు తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు మ్యాచ్ ని నిలబెట్టారని చెప్పాలి. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ కేవలం 27 బంతుల్లో 6 సిక్స్ లు, 11 ఫోర్లతో 84 పరుగులు చేసి సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ (36) అవుట్ అయ్యాడు. కాకపోతే ఫ్రేజర్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు.

తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన షాయి హోప్ 17 బంతుల్లో ధనాధన్ 41 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్స్ లు ఉన్నాయి. అయితే కెప్టెన్ రిషబ్ పంత్ (29) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ 25 బంతుల్లో 48 , అక్షర్ పటేల్ 11 పరుగులు చేసి ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచారు. ముంబై బౌలింగులో బుమ్రా 1, ల్యుక్ వుడ్ 1, పియూష్ చావ్లా 1, మహ్మద్ నబీ 1 వికెట్టు పడగొట్టాడు.

Also Read: పంజాబ్ కింగ్స్ మెరుపు వీరుడు శశాంక్ సింగ్..

ఈ ఓటమితో ముంబై 9 వస్థానంలో ఫిక్స్ అయిపోయింది. దీనికిందనే ఆర్సీబీ ఉండటం విశేషం. ఈ రెండు జట్లలో టీమ్ ఇండియాలో కీలకమైన ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఉండటం విశేషం.

Related News

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

Big Stories

×