Big Stories

CM Revanth Reddy: ఎస్సీ, ఎస్టీ, బీసీలపై BJP సర్జికల్ స్ట్రైక్ చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Press Meet: ప్రధాని మోదీ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేస్తున్నారని, భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2025 నాటికి బీజేపీ భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. 100 ఏళ్లలో భారత్‌ను హిందూ దేశంగా మార్చడానికి ఆర్ఎస్ఎస్ 1925లో ప్రతిజ్ఞ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే 2025 నాటికి దేశాన్ని పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారని కామెంట్స్ చేశారు.

- Advertisement -

దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. అణగారిన వర్గాలపై మోదీ సర్జికల్‌ స్ట్రైక్ చేస్తున్నారని ఫైరయ్యారు. అందుకే కులగణన చేసేందుకు ఇష్టపడడం లేదని విమర్శించారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నిస్తోందన్నారు. 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడమే బీజేపీ అసలు ఉద్దేశమంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు తీసేయడమే బీజేపీ టార్గెట్ అంటూ మండిపడ్డారు.

ప్రాథమిక సూత్రాలపై దాడి చేయాలనే లక్ష్యంతోనే మోదీ, అమిత్ షా దేశంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ వ్యవస్థల్ని ఉపయోగించుకుంటూ.. తమకు అడ్డు ఉన్నవారిపై దాడి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయమని మోదీ కానీ, అమిత్ షా కానీ చెప్పడం లేదని అన్నారు.

బీజేపీ అమలు చేస్తోన్న అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతనే కాంగ్రెస్ వారిపై స్పష్టమైన ఆరోపణలు చేస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్ అడిగిన ప్రశ్నలకు మోదీ, అమిత్ షా, నడ్డాలు సమాధానం చెప్పడం లేదన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ రాజకీయాలను, సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేసే వాటిపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని.. కులగణన చేసి వారికి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వారంతా రాహుల్ గాంధీని కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలన్నారు.

రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే విధానంతో ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలు కుమ్మకై రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మల్కాజిగిలో బీజేపీని గెలిపించే బాధ్యను బీఆర్ఎస్ తీసుకుందని ఆరోపించారు. ఇందులో భాగంగానే మల్కాజిగిరిలో బీజేపీని గెలిపిస్తామని నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: నోరెత్తిన మల్లారెడ్డి, పలకరిస్తే.. వైరల్ చేస్తారా?

ఈటల గెలుస్తారని మల్లారెడ్డి చెప్పినా సరే కేటీఆర్ ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. 5 నియోజకవర్గాల్లో బీజేపీకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని తాను చెప్పగా.. నిన్న మల్లారెడ్డి మాటలతో అది నిజమేనని స్పష్టమైందన్నారు. 10 సంవత్సరాలు పాటు కేసీఆర్ భూములు అమ్ముతుంటే పట్టించుకోని ఈటల.. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దంటున్నారని ప్రశ్నించారు. ఎలా అయినా సరే ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెంచుకుని రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News