E-Paper
Advertisement

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..

Hanmaonda Accident: కారును ఢీ కొట్టిన లారీ.. ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..
Advertisement

Hanmaonda Accident: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన లారీ.. కారును ఢీకొంది. ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన వీరంతా.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిథికి గురువారం రాత్రి కారులో బయల్దేరారు. పెంచికల్ పేట వల్ల ఎదురుగా వస్తోన్న లారీ అదుపుతప్పి వీరి కారును ఢీ కొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులు రేణుక, భార్గవ్, శ్రీదేవిలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను.. మంతెన కాంతయ్య(72), శంకర్ (68), భరత్(29), మంతెన చందన(16)గా గుర్తించారు. మృతులు ములుగు జిల్లా ఏటూరునాగారంకు చెందిన వారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×